The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 0
PoorBest 

లైట్స్ ఆన్!

కేమెరా!!
ఏక్షన్!!!

(వైట్ హౌస్)

ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్

ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్

ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్. మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్!

ఒబామా: అలాగా, సరే, థాంక్స్.

మళ్ళీ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్

ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్

ఫోనులో ఆడ గొంతు: హలో యా! హవ్ ఆర్ యూ యా! దిస్ ఇస్ హిల్లరీ యా!

ఒబామా: వాట్ హేపెండ్ టూ యో లేడీ? వై ఆం ఐ హియరింగన్ ఏక్సెంట్?

హిల్లరీ: ఐ "యాం" "యిన్" "యిండియా" యా. ఎండ్ ఐ లైక్ యిండియన్ యాక్సెంట్ యూ నో

ఒబామా: అమ్మా! తల్లీ! ఇండియన్ ఏక్సెంట్ మాట్లాడింది చాలు గానీ విషయం చెప్పు!

హిల్లరీ: ఇప్పుడే అఫ్ఘాన్ రిపోర్టు వచ్చింది. పరిస్థితి బాలేదు.

ఒబామా: తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు టెర్రరిస్టులకి ఫండింగ్ ఎలా వస్తోందో?

హిల్లరీ: అలసు లేమేన్ చేతో వామూ చేతో మనమే ఫండింగ్ చేయించాల్సింది. ఈపాటికి చచ్చూరుకునేవాళ్ళు.

ఒబామా: నేరం నాది కాదు. జార్జ్ బుష్ ది!

హిల్లరీ: సరే! ఇప్పుడేం చేద్దాం?

ఒబామా: ఏముందీ? స్ట్రేటజీ మార్చాలి. కొత్త పధ్ధతులు ట్రై చెయ్యాలి.

హిల్లరీ: కొత్తవాటికన్నా పాతవే బెటర్ ఏమో?

ఒబామా: అంటే?

హిల్లరీ: ఇది వరకూ సక్సెస్ అయిన ఫార్మ్యూలాలు ఉపయోగించచ్చు కదా?

ఒబామా: అర్థం కాలేదు.

హిల్లరీ: నీకోపట్టాన అర్థం కాదని నాకు తెలుసు గానీ, నేననేది పాత కాలం నాటి యుధ్ధ నీతులు ఉపయోగించచ్చు కదా అని

ఒబామా: గుడ్ అయిడియా. సివిల్ వార్ నీతులు ఉపయోగిద్దామా?

హిల్లరీ: నీ యెంక్ .. వద్దులే బూతులొస్తున్నాయి - నేను మాట్లాడేది వేలకు వేల ఏళ్ళ క్రితం యుధ్ధాల గురించి

ఒబామా: సరే ఇండియాలోనే ఉన్నావు కదా - రామాయణ మహాభారతాలు తీసుకురా

హిల్లరీ: నాయనా, బాబూ తండ్రీ - ఇది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు.

ఒబామా: మరి?

హిల్లరీ: డా|| బ్రౌన్ తో మాట్లాడి టైం మెషీన్ తెప్పించుకో. అది తీసుకుని భారతం టైం కి వెళ్ళి ట్రిక్కులన్నీ నేర్చుకుని రా!

ఒబామా: ఇదేదో బాగానే ఉందే? నేనొక్కడినే వెళ్తే మరి కల్చర్ గేప్ ఉంటుంది కదా?

హిల్లరీ: అదీ నిజమే. ఇక్కడ అమర్ కింగ్ అని ఒక పెద్ద నెగోషియేటర్ ఉన్నాడు. నాకు మాంచి ఫ్రెండ్. తోడు తీసుకెళ్ళు.

ఒబామా: మరి అతనికి యుద్ధం, డిఫెన్స్ గురించి తెలుసా?

హిల్లరీ: అసలు తెలియదు. కానీ పనులు చక్కబెట్టుకొస్తాడు. డిఫెన్స్ కోసం అయితే కేకే ఏంథోనీ ని కూడా తీసుకెళ్ళు. అలాగే కాస్త వినోదం కోసం ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని కూడా తీసుకెళ్ళు.

ఒబామా: అలాగే - థేంక్యూ!! ఇప్పుడే ఈ-మెయిల్ పంపిస్తున్నా

(కంప్యూటర్ బూట్ చెయ్యడానికి ప్రయత్నించి)


ఒబామా: వాట్ ద హెక్? సప్పోర్ట్ లైన్ కి కాల్ చేస్తా

(డయల్ చేస్తున్న చప్పుడు)

ఫోన్ లో కంఠం: "మీరు డయల్ చేసిన నెంబరు మరియొకసారి సరిచూసుకొండి! ప్లీస్ చెక్ ద నంబర్ యూ హావ్ డయల్డ్!

ఒబామా: ఓరినీ! నా టెక్ సపోర్ట్ కూడా అవుట్సోర్స్ అయ్యిందా? రామ రామ!తప్పు తప్పు .. జీసస్ జీసస్!!

(మళ్ళీ డయల్ చేస్తున్న చప్పుడు)

ఫోన్ లో కంఠం: టెక్ సపోర్ట్ - మై నేం ఈస్ రాక్ మేన్ ! హౌ కెన్ ఐ హెల్ప్ యూ?

ఒబామా: (కాసంత చిరాగ్గా) ఏమిటి నీ పేరు రాక్ మేనా? క్రేక్ మేన్ ఏమి కాదూ? నువ్వు ఇండియాలో ఉన్నావని తెలుసుగాని అసలు పేరు చెప్పి చావు.

ఫోన్ లో కంఠం: బండయ్యండి. అయ్యగారు టీ తాగడానికెళ్ళి నన్ను కూకోబెట్టారండి.

ఒబామా: ఖర్మ. ఈ స్లండాగ్ సినిమా తీసినవాడిని షూట్ చెయ్యాలి!!

: ఏటనీసినారేటి? ఏటేటో తెలీకుండా అనీసినారు. రేతిరసలే వన్నం మందు కొట్టీసి సెట్టు కింద తొంగున్న - ఇప్పటికీ పిచ్చిపిచ్చిగా ఉన్నాది.

ఒబామా: ఏమి అనలేదు గాని - నా కంప్యూటర్ బూట్ అవ్వట్లేదు -ఏమి చెయ్యాలో చెప్తావా?

బండయ్య: ఏటవ్వట్లేదూ?

ఒబామా: బూట్ ! బూట్!! అదే ఆన్ అవ్వట్లేదు

బండయ్య: ఓస్ ఇంతేనా! ఆన్ ఆఫ్ ' సిచ్చి ' నొక్కీసి ఆన్ సెయ్యండీ!

(టిక్ క్లిక్ )

ఒబామా: వావ్ యూ ఆర్ ఎ జీనియస్. ఆన్ అయ్యింది. కానీ ఇప్పుడూ ప్రింటర్ పని చెయ్యట్లేదే? అసలే విండోస్ విస్తా నాది.

బండయ్య: మీరేటంటున్నారో నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఇక్కడ ఏది పని చెయ్యకపోయిన ఆఫ్ సేసి ఆన్ చేసీస్తారు కదేటి? పోయినవన్నీ బేగి యెల్లిపొచ్చీస్తాయ్.

(టిక్ క్లిక్ )

ఒబామా: వావ్ - పని చేస్తోంది - థేంక్యూ థేంక్యూ బాయ్ - హమ్మయా ఈ మెయిల్ వెళ్ళిపోయింది!
 
*****

రచయిత: ఏంటప్పుడే నిట్టూర్పు విడిచేస్తున్నారు?

చదివినోళ్ళు: అంటే! ఇంకా ఉందా??

రచయిత: ఆయ్..ఉందండీ..పార్ట్ - 2

చదివినోళ్ళు: *#@$
*****

Comments   

 
0 #2 RE: ఒబామహాభారతం Phani 2012-01-29 20:21
ఈ కథ మలక్‌పేట రౌడీ బ్లాగులో చదివిన జ్ఞాపకం, కరష్టేనా?

ఫణీంద్ర
Quote
 
 
0 #1 padmarpita padmarpita 2012-01-29 19:00
:-) waiting for Part-2:-)
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh