The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 1
PoorBest 

బ్యాక్ డ్రాప్:

గుండీలు తీసిన బంటైన జైలు వార్డెను గారు హడావుడైపోతున్నారు. బొడ్డుకిందకు జారిన బెల్టును, ప్యాంటుతో బాటు పైకిలాక్కొంటూనే హడావుడైపోతున్నారు. దొరగారు హైరానా పడితే కాల్మొక్త బాంచెన్లు తాపీగా కూర్చోగలరా? గలలేరు కాబట్టే అసిస్టెంటు వార్డెను నుండి కసువునూడ్చే తిమ్మమ్మదాకా అందరూ హడావుడైపోయారు.


ఫోర్ గ్రౌండ్:

"గురూ!"

"ఏం శిష్యా!"

"జైలంతా హడావుడి గురూ!"

"నీ ధ్యానాన్ని మరల్చకు శిష్యా!"

"ధ్యానం మానాన ధ్యానం జరుగుతోంది గురూ! జస్ట్ ధ్యాసను మరల్చానంతే!"

"మల్టీ టాస్కింగా శిష్యా?"

"కొద్దిగా అటువంటిదే గురూ! మల్టిపుల్ ట్యాపింగ్!"

"వెర్రోహం! మరా హడావుడెందుకో తెలిసిందా శిష్యా?"

"తెలిసింది గురూ! తెలపమంటారా!"

"తెలిపితేనె తెలియు తెలివెందుకందువా?
ఆంజనేయుడైన అట్లె తెలిసె
కన్నుతోన కన్న విణ్ణానమంతయు
కర్ణరంద్రమందె కాపురమ్ము"

"ఆహా! ఏం చెప్పారో అర్థం కాలేదు కానీ మీ కాకాలు తెగ నచ్చాయి గురూ!"

"వెర్రోహం! విషయాన్ని విశిదం చెయ్యి శిష్యా!"

"మన జైలుకు గొప్పవాళ్ళొస్తున్నారు గురూ!"

"మన జైలేమిటి శిష్యా? ఇక్కడ మనం మనసులు మార్చడానికి వచ్చాము గానీ..."

"అదేలేండి గురూ! అందువల్లే మన జైలన్నా. ఇంతకీ ఆ మహామహులెవ్వరో చెప్పనా?"

"అవశ్యం శిష్యా!"

"అఫ్జల్ గురూ"

"?"

"అజ్మల్ అమీర్ కసబ్"

"!!"

"నిత్యానంద"

"@^*"

"అవును గురూ! మనకు నోటి నిండా పని..చేతి నిండా పని"

బ్యాక్ గ్రౌండ్:

గుండీలు తీసిన వార్డెను గారు, ఆయనకు ప్రథమ కాల్మొక్త బాంచెను గారైన అసిస్టెంట్ వార్డెను గారు, తతిమ్మా బాంచెనులు + తిమ్మమ్మ, దొరగారి కేబిన్లో అత్యవసర సమావేశమయ్యారు.


వార్డెన్: "ఎవరొస్తున్నారో మీకు తెలుసుకదా?"

బాంచెన్లు: "ఔ" "ఎస్" "వో యా"

వార్డెన్: "మీ సలహాలు, సందేహాలూ చెప్పండి"

బాంచెన్ 1: "దొరగారూ! నా అనుమానం ఏంటంటే మన జైల్లో ఖాళీగా ఉండేవి రెండే సెల్లులు. వస్తున్న అతిథులు ముగ్గురు. ఎలా...సర్దేది?"

వార్డెన్: "అవును! నిజమే! చిక్కే! అసిస్టెంట్ నువ్వు చెప్పు"

అసిస్టెంట్: "సార్! అఫ్జల్ గురూని, కసబ్ ను కలిపి ఉంచలేం. ఉంచితే తీవ్రవాది x తీవ్రవాది = తీవ్రవాది స్వేర్ ఔతుంది."

వార్డెన్: "నువ్వు బి.ఎస్సీ మాథమెటిక్సని నాకు తెలుసులేవోయ్! సలహా చెప్పు చాలు"

అసిస్టెంట్: "ఎస్ సార్! సారీ సార్! నిత్యానందను వీళ్ళల్లో ఒకరితో ఉంచలేం."

వార్డెన్: "ఎస్. కల్చర్ క్లాష్ ను మనం ప్రోత్సహించలేం."

అసిస్టెంట్: "ఎస్ సర్! అలాగని నిత్యానందను ఒంటరి సెల్లులో బంధించలేం. పాపం అలవాటుపడ్డ ప్రాణి. తోడులేకుండా పడుకోలేడు."

వార్డెన్: "అసిస్టెంటూ! నీ అనాలసిస్సు గొప్పగా ఉందయ్యా!"

అసిస్టెంట్: "ఎస్ సర్! ష్యూర్ సర్! థ్యాంక్స్ సర్"

వార్డెన్: "బొంద సర్రేమీ కాదూ! సలహాలివ్వమంటే బోడి అనాలిసిస్సులేమిటయ్యా అసిస్టెంటు"

అసిస్టెంట్: "సారీ సర్! బట్ సర్!....."

బాంచెన్ 2: "సార్! అమ్మగారి ఫోను"

వార్డెన్ (తలకొట్టుకొంటూ): "హాలో!"

లైన్లో: "&^*@!$"

వార్డెన్ (బిర్రబిగిసి): "అలాగేలే! నువ్వింక ఉండు." (ఫోన్ పెట్టేసి) నిత్యానంద స్వామికి లోటు రాకుండా చూసుకోవాలని అమ్మగారి కోరిక"

అసిస్టెంట్: "ఎస్ సర్! బట్ ఇది చాలా స్ట్రేంజ్ సర్! కెన్ వుయ్ నో ది రీజన్ సర్!"

వార్డెన్: "రంజిత అమ్మగారికి వేలువిడిచిన బంధువు."

అసిస్టెంట్: "అంటే సర్! యూ మీన్....ఐ మీన్...దట్ మీన్స్..."

వార్డెన్ (తలపట్టుకొని): "ఉష్షో! అసలే స్వామి దూరమైపోయిన దుఃఖంలో ఉన్న రంజిత అమ్మగారికి ఫోన్ చేసి స్వామితో తప్పకుండా ఎవరైనా తోడు పడుకోవాని కోరింది. అమ్మగారు ఎస్సన్నారు!"

అసిస్టెంట్: "ఓహ్ పాథెటిక్ సర్! అంటే ఇప్పుడు మీరే...ఆ స్వామితో..."

వార్డెన్: "అసిస్టెంటూ! నిన్ను మర్డర్ చేస్తా"

అసిస్టెంట్: "అప్పుడు ఎంచక్కా నిత్యానందతో సెల్లు షేర్ చేసుకోవచ్చు సార్!"

వార్డెన్ (తలపట్టుకొని): "ఉష్షో!"

తిమ్మమ్మ: "దొరా! నా మాట ఇంటానంటే...."

వార్డెన్ (వెర్రి చూపుల్తో): "తిమ్మమ్మా! నువ్వు కూడా జోకులేస్తావా?"

తిమ్మమ్మ: "దొరా! నా మాట ఇంటానంటే..."

వార్డెన్ (తల పట్టుకొని): "ఇంటా తల్లీ! ఇంటా బైటా ఆడవాళ్ళదే రాజ్యం. చెప్పు"

తిమ్మమ్మ: "అల్ల ఓ పాలి ఆరుబైట సెట్టు కాడ సూడు దొరా!"

వార్డెన్: "చూసాను తల్లీ! అక్కడ చెట్టు ఉండెను. దానికి కొమ్మలుండెను. కాండం చుట్టూ సిమెంటు చప్టా ఉండెను."

తిమ్మమ్మ: "బలే చెప్పినారు దొరా! ఆ చప్టా పైన ఏముండాదో సూడు దొరా!"

వార్డెన్: "చప్టా మీద.....హు....ఖైదీలకి ఆసానాలు నేర్పించే వెర్రోహం స్వామీ...ఆయన శిష్యుడు"

తిమ్మమ్మ: "ఔ దొరా! ఆసనాల సామిని నిత్యానంద సామితో జంటగా కూకోపెట్టు దొరా!"

వార్డెన్: "వారెవ్వా! క్యా బాత్ హై! తిమ్మమ్మా...ఉమ్మ....చుమ్మ...ఉమ్మా"

తిమ్మమ్మ (చెంపలు తుడుచుకుంటూ): "అబ్బా! దొరా! నీ ముద్దు...."

ఫోర్ గ్రౌండ్:

"గురూ!"

"వాళ్ళు వచ్చేసారా శిష్యా!"

"చిత్తం గురూ! మరి నే వెళ్ళొస్తా!"

"అదేమిటి శిష్యా! మనం వెళదామా అని కదా నువ్వు చెప్పవలసింది"

"ఈరోజు నుంచీ అంతేలే గురూ! మీరు నిత్యానందతో బాటు సెల్లులో ఆసనాలేసుకోవాలని....."

"...అని కూసిందెవరు నాయనా!"

"నేనే! గుండీలు తీసిన బంటుని. ఈ జైలు వార్డెన్ని. నీకు ఆసనాల కాంట్రాక్ట్ ఇప్పించిన దాతని. లే స్వామీ! నడువు స్వామీ!"

"వెర్రోహం! ఇది అన్యాయం"

వార్డెన్ (మరో గుండీ విప్పి) "ఇంట్లో నాకు జరుగుతున్న దానికంటేనా...నడు నడు స్వామీ!"

@@@@

Comments   

 
0 #2 RE: జైల్లో పక్షులు IVNS 2011-11-24 12:26
సైలెంటుగా వేర్రిమొహం తో మాట్లడుతున్న శిష్యుడు ఆలి
Quote
 
 
+1 #1 RE: జైల్లో పక్షులు IVNS 2011-11-24 12:19
మా చెడ్డ నవ్వోచ్చేసింది దుర్భిణి గారు.
వెర్రోహం స్వామి గా AVS
గుండీలు తీసిన వార్డెన్ గా బ్రహ్మానందం
తిమ్మమ్మ: చదివేవారి విజ్ఞతకు వదిలేసా
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh