The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 1
PoorBest 
అప్పన్న :  ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన పేరుమీద మరి పరిపాలన సేయ్యరే!

రాజన్న : నీ మొగం.  పెమాన సీకారం నువ్వు సూడలేదా  గవర్నరు గారు సెప్పింది సెప్పి  దేవుడు మీద పెమానం సేసి కుర్సీలో కూసుంటారు. రావుడా
సోవుడా !!

అప్పన్న :  మరి ఎందుకు అలా సెపుతారు?

రాజన్న : అంటే రావుడిలా పాలిత్తాను అని  

అప్పన్న: ఎహే మళ్ళీ అదే మాట ఆడు రావుడు కాదు కదా

రాజన్న : ఎర్రి మొగమా నీకు ఇంకా తెల్దు. అవన్నీ రాజకీయాలు

అప్పన్న : ఏంటి రామరాజ్యం తెత్తం కూడా రాజకీయమేనా ?

రాజన్న : ఆ మాటకి  వత్తే దర్మం, నాయం, సట్టం,  పోలీసులు అన్నీ రాజకీయమే

అప్పన్న : ఏవో రా సెడ్డ  తిరకాసుగా ఉంది.  మొన్న రామాయనం ఆ సేగంటాయన  సెప్పినపుడు  బలే ఉందిరా. నేనైతే ఒక కలే కన్నాను ఏంటో  తెలుసా ?

రాజన్న: కలే ఏంటది ?

అప్పన్న: మొన్న అ జగన్ బాబు వచ్చి నా బుగ్గలు నిమిరి ఒదార్సాడు సూడు అప్పుడు వచ్చిన్దీకల.  అంతకు ముందురోజే ఆ   సేగంటాయన బరతుడు ఎంతో బక్తి తో అయోద్యని రాముడి సెప్పులు సూత్తూ పాలిత్తాడు అని  అలాగే నేను ఆ జగన్ బాబు సి ఎం అయితే ఆళ్ళ నాన్న సెప్పులు కుర్సీలో పెట్టి పూజ సేసి ఆటిని సూత్తూ పాలిత్తాడేమోనని అనుకున్నట్టూ,   మాకోద్దంటే మాకొద్దు ఈ  రాజ్యం అని రాములోరు ఆయన తమ్ముళ్ళు దెబ్బలాడుకున్నారట గదా.  అలాగే వచ్చే ఎన్నికల్లో మాకోద్దంటే మాకొద్దు ఈ సిఎం పదవి అని రాములోరి సెప్పుల కోసం ఆ సిరంజీవి, కిరను, జగను, బొత్స దెబ్బలాడుకుంటారేమో అని నీకు సెప్పుతున్నట్టూ కలొచ్చింది . ఏమైనా కుర్సీలో రాములోరి సెప్పులు పెట్టి పరిపాలించడం బలే ఇసయం!

రాజన్న :  కల కాదు ఇప్పుడు నిజంగానే నువ్వు నాకు సెప్పేసావు .  వురై నీకు రామాయణం బాగా తలకెక్కింది అందుకే నీకీ పిచ్చి కలలు.

అప్పన్న: కాదురా బా జ పా గెలిత్తే అలా అయోధ్య నుంచి రాములోరి సెప్పులు కురిసీ లో పెట్టి పాలిత్తారేమో రా నాకు మా చెడ్డ ఉబలాటం గా ఉంది అలా సూడాలని

రాజన్న : మరి సోనియా గాంది వత్తే

అప్పన్న : సోనియా సెప్పులు కురిసీలో పెట్టి రాహులు బాబు పాలిత్తాడు.

రాజన్న :  అంటే నీకు ఎవరో ఒకరు ఎవరో ఒకరి సెప్పులు కురిసీలో పెట్టి పాలించాలని ఉందన్న మాట.  నీకు పిచ్చి బాగా ముదిరి
పోయిందిరోయ్. పద నీ ఇంటిది పిలుత్తుంది కూడు తిండానికి.  తిని తొంగో రేపు కలుద్దాం.

Comments   

 
0 #2 RE: రామ రాజ్యం IVNS 2012-06-08 05:59
ఔను కొత్త పాళీ గారూ
రామ రాజ్యానికి సరికొత్త భాష్యం ఇది .
Quote
 
 
+1 #1 RE: రామ రాజ్యం కొత్తపాళీ 2012-06-07 17:28
బాగుంది. ఈ వర్తమాన కాలంలో రామరాజ్యం అంటే చెప్పుల రాజ్యం అన్న మాట
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh