The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మన గవర్నర్ గారు లాంఛనంగా తన ప్రసంగంతో ప్రారంభించేసారట. ఆయన ప్రసంగంపై రాజకీయ పక్షాలు మండిపడ్డాయి.

కమ్యూనిస్టులు : ప్రజలపై పన్నులు మోపి ఆదాయం పెరిగిందని చెప్పుకోవటం, అవినీతిలో మునిగిన ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయటం, ఓవరాల్ ఇటువంటివేమీ పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగం మసి పూసి మారేడుకాయను చేసిందని కమ్యూనిస్టులందరు తమ నిరసనను చెవులో పూలు పెట్టుకోవటంద్వారా ప్రదర్శించారట!

అది చూసి గవర్నర్ ఏదో బాధపడిపోతారని, పడకపోతే ఈసారి చెవిలో పూలు కాకుండా గుండు చేయించుకొని నిరసన చేద్దామనుకునే ఆలోచన చేస్తున్నారేమో మన కమ్యూనిస్టులు. వాళ్ళు ఓ విషయం మర్చిపోయినట్లున్నారు. చెవిలో పూలు పెట్టుకోటానికే మన గవర్నరు గారు వారానికోసారి తిరుపతి వెళ్తుంటారు కదా. కమ్యూనిస్టుల చెవిలో పూలు చూసి ఈయన బాగా ఆనందపడే ఉంటారు.

తె.రా.స. : గవర్నర్ ప్రసంగంలో తెలంగాణా అంశం లేకపోతే నిరసన ప్రదర్శిస్తామని తెరాస ముందుగానే హెచ్చరించింది. ఊహించినట్లుగానే గవర్నర్ తెలంగాణా అంశం ప్రస్తావించలేదు. మరి తెరాస నేతలు కమ్యూనిస్టుల ప్రేరణతో ఎక్కడ ఏం పెట్టుకుంటారోనని ప్రజలు హడలిపోతున్నారట! ఐ మీన్ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారోనని నాలుగు కోట్ల ఆకాంక్షలు కంగారు పడుతున్నాయని భోగట్టా!

 

* * *

 

అయినా చెవిలో పూలు పెట్టటంలో సెకండ్ టు నన్ దిగ్విజయ్ సింగైతే, ఇప్పుడిప్పుడే డిగ్గిరాజాకు దడ పుట్టిస్తున్నాడట సల్మాన్ ఖుర్షీద్. ఓ.బి.సి. రిజర్వేషన్లలో ముస్లీములకు 9 శాతం ఉపకోటా కల్పిస్తామని దురద పుట్టినప్పుడల్లా ఈయన పూలు పెట్టేస్తుంటే, యు.పి. ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించకూడదని ఎన్నికల కమిటీ లాలించి, మందలించి, కాళ్లావేళ్ళా పడి బ్రతిమాలి, ఊరుకుంది.

ఆయనకా దురద తీరలేదు, పూలు పెట్టటమూ మానలేదు, ఎన్నికల కమిటీ పరువూ నిలవలేదు. ఇకపైగా, నా ముక్కు, నా దురద నా ఇష్టం. నా పార్టీ మానిఫెస్టో పెద్దగా చదివితే మీకేంటి ప్రాబ్లం అని కాలీ ఫ్లవర్లు కాబేజీల కోసం ఎదురుచూస్తున్నాడట! చివరాఖరికి ఎన్నికల కమిషన్ ఆ పూలు ఓ ఫిర్యాదు పత్రంతోపాటుగా రాష్ట్రపతికి పంపితే, ఆమె అవే పూలు అవే ఫిర్యాదు పత్రం ప్రధానికి పంపిందట! జనాలందరికీ ఆల్రెడీ అన్నేసి పూలు పెట్టేసాక ప్రధాని ఆ పూలు పత్రం మడిచెక్కడ పడేస్తారో చాలా ఆసక్తిగా ఉందా లేదా?

@@@@@

Comments   

 
0 #2 RE: చిటపటలు-21 "చెవిలో పూలు" IVNS 2012-02-14 12:02
బడ్జెట్ సమావేశాలు ఒక సాలీనా జరిగే కాకి లెక్కల కథలు చెప్పుకొనే సమయాలు - కాకులకే నవ్వోచ్చెంతగా
గవర్నరు ప్రసంగం - రాష్ట్రపతి ప్రసంగం ఇవి కేవలం వ్రాత ప్రతులను చదవడం తో సరి.
ఎందుకు దీనిని ఒక మర్యాదగా భావించి కొనసాగిస్తున్నమ ో తెలియదు రాష్ట్రపతి గాని గవర్నరు గాని ఒక్క ముక్క వాళ్ళ సొంతానిది వాడుకోలేరు
వారు సర్వ శైన్యాది పతులు!! వారి పేరు మీదుగా పాలన!!
ప్రధాని ముఖ్యమంత్రి ప్రభుత్వాదినేతల ుగా వారు చెప్పవలసింది చెప్పవచ్చు గా దానికి ఒక పెద్ద పదవి లో ఉన్న రాష్ట్రపతి గవర్నరు కావాలా ?
మన రాష్ట్రపతి, గవర్నరు వ్యవస్థ కూలంకషంగా మార్చవలసి ఉన్నది . ఎన్నికల కమీషన్ లాగ
మీ వ్యాసం ఈ పై ఆలోచనలను రేకెత్తించింది సవ్యసాచి గారు
Quote
 
 
0 #1 RE: చిటపటలు-21 "చెవిలో పూలు" Sivaji N 2012-02-13 10:24
excellent pun :D
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh