The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 4
PoorBest 

"అంతరాంత జ్యోతిస్సీమల్ని బహిర్గతం" చేసేదే కవిత్వమని తన అభిప్రాయాన్ని చెప్పాడు తిలక్.

పరిణామాల పరిమాణాలను, అనుభవాల అనుశీలనను కలగలపినప్పుడు మనసులో ఓ వెలుగు పరచుకుంటుంది. ఆ వెలుగు సహాయంతో చూసినప్పుడు చూసిన వస్తువులే మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి. జడపదార్థంలో సైతం ఓ అస్తిత్వం అగుపిస్తుంది. ఆ అపురూపక్షణంలో మానవుడు ’కవి’యై కలవరిస్తాడు. 

సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, వెన్నెల రాత్రులు, మెరిసే నక్షత్రాలు, గడ్డిపూలు, వాన చినుకులు, పారే నదులు, కదిలే నావలు - సౌందర్యోపాసకుడు మాత్రమే అయిన కవి ఈ ప్రకృతి వైచిత్రానికి అచ్చెరువొందుతూ అక్కడే కవితలల్లుకుంటూ ఉంటాడు. అదే కవి తాత్వికుడు కూడా అయితే, కాలప్రవాహపు ఒడ్డున నిలబడి పారే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వెలుగు చీకట్లు, సుఖ దు:ఖాలు, సంతోష విచారాలను తామరాకు మీది నీటిబొట్టులా ఒక సాక్షీభూతంగా గమనిస్తూ అన్వేషిస్తూ ఉంటాడు. కలవరింత ముగియగానే, ఆ అంతస్సీమల జ్యోతి కాస్త కనుమరుగు కాగానే లౌకిక జీవనపు పరిచిత చీకటిదారిలో ఒంటరి బాటసారిలా మిగిలిపోతాడు మానవుడు.

గాలి వీస్తే
మబ్బుల్లోని చినుకుల్ని
కురుస్తుంది చెట్టు
 

అని అంతరంగపు వెలుగు జాడను చెప్పగలిగే బి.వి.వి. ప్రసాదు గారి "నేను కాని నేను ఎవరు" అనే అన్వేషణలో మలి మజిలీ "నేనే ఈ క్షణం" సంకలనం ఆవకాయ.కామ్ పాఠకుల కోసం ఈపుస్తకంగా అందజేస్తున్నాం. అందుకోండి.

అభినందనలతో

ఆవకాయ.కామ్ బృందం

Attachments:
FileDescriptionDownloads
Download this file (Nene Ee Kshanam BVVPrasad 4.0.pdf)బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం"బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం"577

Comments   

 
+1 #6 ఈపుస్తకం - బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం" BVV Prasad 2013-04-03 08:05
రఘు గారూ..
అనువాదాలని మరింత ప్రోత్సహించే మీ ఆలోచన బావుంది. ధన్యవాదాలు.
ఇక్బాల్ చంద్ గారూ..
మీ సహృదయ పరామర్శ చాలా సంతోషాన్నిచ్చిం ది. కృతజ్ఞుడిని.
శ్యామల గారూ.. అలాగే చెయ్యండి. మీకు మరోసారి ధన్యవాదాలు.

మంచి కవిత్వం చదివి నచ్చిన మిత్రులు
వారి స్పందనని పంచుకోవడం, ఆ కవిత్వానికీ, కవికీ ఆసరానివ్వడం అని గుర్తించగలరు.

మీ,
బివివి ప్రసాద్
Quote
 
 
+1 #5 ఈపుస్తకం - బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం" Syamala Kallury 2013-04-02 06:13
I am currently doing a regular column for vaakili.com and I need to constantly be on the look out for good poetry. I found your poems are very senstive. Once I finish translating them I will send them to you and to vaakili also Thanks for the permission
Quote
 
 
+2 #4 Prasad garoo! mee kavitvam Iqbal Chand 2013-03-31 11:15
ఇంతటి సంస్కారవంతమయిన కవిత్వం ఎలా రాయగలిగారండీ?

మీ కవిత్వం లో ఎంత వెదికినా ఒక్క అనవసరపు అక్షరం కనిపించదు.
నిజానికి మీదో భిన్నమైన గొంతుక. సున్నితమైన భావుకత,మీవైన వర్ణనలు మిమ్మలను సమకాలీన కవుల్లో భిన్నంగా చూపుతుంది.

మీ కవిత్వాన్ని మల్లీ మల్లీ అప్పుడప్పుడూ చదువుతుంటాను.పం కజ్ ఉదాస్ అంటాడూ కదా థోడా థోడా పియాకరో అని...అలా అన్నట్లు...

కొంచెం కొంచెం నా మధుపాత్రిక లోకి మీ కవిత్వభావుకతను వొంపుకొని దానిలొ చంద్రబింబాన్ని తేలి ఆడిస్తుంటాను..

Thank you so much Prasad garu!

ఏదో అవార్డులు ఇస్తామని కొంత మంది మిమ్మల్ని దారి మల్లించే పనిలో వుంటారు.వారి మాయ లో పడకండి.

మీ కవితా యోగం లొ కొన్ని రహస్యాల్ని మాకూ ఇలా చెబుతుండండి.మీ సౌందర్య సీమ లో మేమూ వొకింత ప్రకాశిస్తుంటాం ...
Quote
 
 
+3 #3 ఈపుస్తకం - బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం" Raghothama Rao 2013-03-31 09:26
I am so happy to see the below conversation. Hope that Avakaaya gets the privilege of publishing these translations.

This is inspiring us to think of a dedicated sub-domain to feature translations.

I also feel that translations from other languages into Telugu also would strengthen the cultural bridge.

Regards
Raghu
Quote
 
 
+5 #2 ఈపుస్తకం - బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం" BVV Prasad 2013-03-31 03:31
Quoting Syamala Kallury:
Can I try translating a few poems into English. About five/six poems. Prasad garu if you have no objection please let me know. I find your poems are very sensitive.

Syamala garu, Please translate the poems, whatever you wish to. And let me know the translation by sending it to . Thank you for the compliment on my poetry. Regards, Prasad
Quote
 
 
+4 #1 ఈపుస్తకం - బి.వి.వి. ప్రసాద్ "నేనే ఈ క్షణం" Syamala Kallury 2013-03-30 14:40
Can I try translating a few poems into English. About five/six poems. Prasad garu if you have no objection please let me know. I find your poems are very sensitive.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh