User Rating:  / 2
PoorBest 

పసివాళ్ళ నుంచి పండు ముదుసలి వరకూ ఏది అడిగినా క్షణాల్లో ఇస్తుంది గూగుల్.  ఇలా ఇవ్వడం లో దాగిన మంచి-చెడుల ఆలోచనే ఈ గూగులమ్మ పదాలు. 

గూగులమ్మ పదాలు

  1. టైపు చేసిన పదము - టక్కునిచ్చును ఫలము - టెక్కునాలజి సుమ్ము - ఓ గూగులమ్మా
  2. అడుగవలయును జగతి - అలుపులెరుగని రీతి - వార్తలిచ్చును త్వరితి - ఓ గూగులమ్మా
  3. తీపి కబురుల తోడ - హత్య, వరదల నీడ - "వింత చింతల జాడ"- ఓ గూగులమ్మా
  4. కళ్ళలోనే బళ్ళు [బడులు] - దాచలేదులె కుళ్ళు - చెరిగిపోని చేవ్రాళ్ళు - ఓ గూగులమ్మా
  5. అడిగితే చెప్పేను - లోకమే తిప్పేను - ఎప్పుడూ నప్పేను - ఓ గూగులమ్మా
  6. నిందలెరుగని రీతి - నైజ వార్తల ఫణితి - నిలుపు మా జగతి - ఓ గూగులమ్మా       
  7. నీవు ఇచ్చెడి వార్త - నిత్య సత్యపు మూర్త - అహోరాత్రపు జాత్ర - ఓ గూగులమ్మా       
  8. సమాచారము జతకు - సదాచారము అతుకు - మార్చుమా ఈ బతుకు - ఓ గూగులమ్మా       
  9. గోప్య మెరుగనిదండి  - గుట్టునుంచదు సుండి  - మితిగా అడగండి - ఓ గూగులమ్మా       
  10. నీలొ వెతికే వారు - తప్పొప్పుల వారు - ఇరువురూ ఉన్నారు - ఓ గూగులమ్మా       
  11. బూతులెతికే వారు - భక్తి కోరువారు - ఎందరెందరొ కలరు - ఓ గూగులమ్మా 
  12. ఋతుశోభలను తెలియ - నీ ఇమేజులె గతిగ - బ్రతుకు మారెను అయ్యయా - ఓ గూగులమ్మా        
  13. పాతరేసిన నిజాలు - వెదికి పట్టెడి మజాలు - బూజు రాలుతు ఇజాలు -  ఓ గూగులమ్మా       
  14. తెలివిగలవానికి - తెలియలేని వానికి - భేదమెంచవు నిజానికి - ఓ గూగులమ్మా       
  15. మర్రి ఊడలా జ్ఞానం - వేరుపురుగై అజ్ఞానం - ఏది నిజమగు విజ్ఞానం - ఓ గూగులమ్మా       
  16. కూరుచున్న చోట - పుట్టు వార్తల ఊట - చిందదోయీ చెమట - ఓ గూగులమ్మా       
  17. నింగిలో గుసగుసలు - నేలలో బుసబుసలు - మనసులో మిసమిసలు - ఓ గూగులమ్మా       
  18. మతము మత్తుమందా! - మూర్ఖమే కొత్త మందా? - జనహితమసలుందా! - ఓ గూగులమ్మా
  19. విషము చిమ్మును కొన్ని - విషము విరచును కొన్ని - నీలోనే ఉన్నవన్నీ - ఓ గూగులమ్మా 
  20. అస్తి, నాస్తి కతలు - అంతులెరుగని వెతలు - నీవు చెప్పెడి కథలు - ఓ గూగులమ్మా       
  21. పిండి వంటలు కొసరి - వడ్డించేవు సరిసరి - సాటిలేని గడుసరి - ఓ గూగులమ్మ       
  22. ఆన్‍లైన్ బకాయి - తీర్చితేనే హాయి - లేద మెడపై రాయి - ఓ గూగులమ్మా
  23. నీవు పలికెడి నిజము - నివ్వటిల్లును జగము - మారునా మా నైజము -  ఓ గూగులమ్మా       
  24. నీవు విప్పెడి చిట్టా - బెట్టా కనికట్టా - లేక చిత్ర గుప్తు చిట్టా! - ఓ గూగులమ్మా

 

గూగులమ్మ పేరుతో ఓ గ్రామ దేవత ఉందన్న విషయం ఈ క్రింది లింకు వల్ల తెలుస్తోంది.

http://hindupad.com/tag/gugulamma-temples/

Comments   

 
+1 #1 గూగులమ్మ పదాలు IVNS 2014-11-18 06:00
నేను పంపిన గూగులమ్మ పదాలకు తుది మెరుగులు దిద్దిన రఘోత్తమరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh