User Rating:  / 0
PoorBest 

అనఘా అని పిలవబడే జనులు తక్కువైన కాలంలో సైతం 

ఘనమెక్కడా తగ్గని రీతిలో సాగుతోంది ఋతువుల యానం 

చెట్టు చేమ, రాయి రప్ప, గాలి వాన, ఎండా చలి, రేయి పగలు 

పురుగు పుట్రా, నీరు నిప్పు, నింగి నేలా, మార్చుకోవు వాటి నైజాలు

 

నైజం మార్చుకొంటూ నిజానికి దూరమౌతూ 

నేడు గడిస్తే మరునాడు వస్తుందని తలస్తూ 

కాలాన్ని మారని ఒక కొలమానంగా  చూస్తూ 

రోజులు గడిపేసే మనిషికి మాఘం  కాదు అమోఘం!

 

మానవ చరిత్ర లో కాల ప్రతిభ జాస్తి 

ఆమాటకొస్తే కాలమే మనం వెతికే అతీతమైన శక్తి 

యుక్తి తో జీవించే వారికి కాలమే దైవం 

కుయుక్తి తో సహవాసం మొదటికే మోసం 

 

గడచిన ప్రతి రోజూ ఆ దేవుని అనుగ్రహం 

గడిపే ప్రతి క్షణం దైవం తో ఉపవాసం 

రాబోయే కాలం దైవం యొక్క ప్రసాదం 

కాలమే జీవికి పరమాత్మఇచ్చిన ప్రాసాదం !!

 

దేశకాల సంకీర్తనలో కవిత్వం దైవత్వం

సమ్మిళితమై జీవికి అందించును తత్వం

దైవాన్ని నమ్మి చెడిన వారు లేరు అనే నిజం

ఎప్పటికీ నిలచిపోయే ఒక అమోఘ సత్యం

 

మాఘం గడిస్తే ఫాల్గుణం

 

ఎవరూ ఆపలేని చక్రభ్రమణం  

ఓకాలమా! నీకు నా నమస్కారం 

నీ ఎరుకే నాకు గొప్ప పురస్కారం 

 

 

 

Comments   

 
0 #2 మాఘ మాసం అమోఘ హాసం !! IVNS 2015-02-21 10:49
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు కాదంబరి గారు.
కాలం ధర్మం అనే పదాల పై, నిజమే మీరన్నట్లు, మన భారతీయులకున్న అవగాహన మెండు!
Quote
 
 
+1 #1 మాఘ మాసం అమోఘ హాసం !! kadambari.piduri 2015-02-18 05:36
కాలం, ధర్మం - అనే మాటలకు భారతీయుల నిఘంటువులో ఉన్నంత విపుల భావం, మరి ఏ ఇతర దేశాలలోనూ కనుగొనము. కాలం స్వరూపం, అవగాహనయే మనిషికి గొప్ప వరం. తేలికపాటి పదాల పొందికతో చక్కని కవిత అందించారు IVNS గారూ!
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh