The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 13
PoorBest 

ఆంధ్రుల భాషకు అక్షరాలు ఏబది ఆరు అంటే అవునా అని ఆశ్చర్యపయేవారు, అవును కాబోలు అని సర్దుకుపయేవారూ ఈ మధ్య ఎక్కువమందే కనిపిస్తునారు.అదివారితప్పా??

ఏమోమరి!

ఋ,ౠ తరువాత లు లూ( వాటిని ఇక్కడ వ్రాయ వీల్లేదు కదా) ఎప్పుడో మరుగునపడ్డాయి. సరేలే "ర" తోనూ "ల" తోనూ పని నడిపించుకోవచ్చు అనుకున్నాం. మరి ఆ "ర" తోనే ఇంకాస్త పని నడిపించుకోండి అని బండి ర ని కూడా అక్షరమాలనుంచి ఆవలపడేసేరు(ఎవరూ అని మాత్రం అడగకండి).అక్కడితో ఋషులంతా రుషులయ్యేరు.అది అచ్చులకు పట్టిన గతి.

ఇక హల్లుల విషయానికొస్తే క వర్గు, చ వర్గుల చివర వచ్చే అనునాసికాలను వాడడం ఎలాగో కూడా తెలియకుండా పోయింది ప్రస్తుతం. శంకరుడు, పంకజము, పంచాంగములు రూపాంతరం చెందిపోయేయి.అయినప్పటికీ పెద్ద ఇబ్బంది ఏమీలేదని సరిపెట్టేసుకుంది ఆంధ్రమాత.

ఎంత సర్ధుకుపోయినా మరీ ఇంతలా చేస్తారా అంటూ ఈమధ్యనే కలలో కనపడి వాపోయింది. "ఏమమ్మా ఏమయింది?" అని అడిగేను.

అంతే పట్టరాని దుఃఖంతో "ఏమని చెప్పమంటావు కామేశా, అది వృధా ఇది దండగ అంటూ ఎన్ని అక్షరాలు తొలగించినా ఏమీ మాట్లాడక ఊరుకున్నాను. అదే అలుసుగా చేసుకుని ఇంకా చిత్రవధ చేస్తుంటే ఏడ్వక ఏం చెయ్యనయ్యా?" అంది.

"ఏడవకమ్మా, తెలుగుభాషంటే ప్రాణంగా ప్రేమించే నేను నీవు దుఃఖిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా, అసలు నీ దు:ఖ కారణం వివరంగా చెప్పుతల్లీ!" అంటే ఇలా చెప్పుకొచ్చింది...

"ఇప్పటివరకూ మింగిన అక్షరాలతోపాటూ '' ని కూడా ఈ మధ్య మింగేసేరు, కళ్ళు అనడానికి కల్లు అంటునారు. కల్లు అంటే నీకు తెలుసుగా, తాటికల్లో ఈతకల్లో అవదా??, ఇంకొంచెం లోతుకు వెళితే కల్లు అంటే రాయి కూడా అవుతుందికదా ( ఉప్పు కల్లు, సన్నికల్లు) మరి వీళ్ళు కళ్ళని కల్లు అంటే బాధపడనటయ్యా?

పెళ్ళిని పెల్లి అంటునారు, కళని కల అంటునారు, వాళ్ళని వాల్లు అంటునారు. టీవీ లంగరులూ, సినిమాల్లో డబ్బింగుచెప్పేవారూ, వార్తలు చదివేవారు ఇక వారూ వీరూ ఏమిటయ్యా అందరూ ఇదే వరస".

తీరా ఆవిడ చెప్పేక అనిపించింది అడిగి పొరబాటు చేసేనా అని ఎందుకంటే పెల్లికాదర్రా పెళ్ళి అనాలి అని ఈ మధ్య ఎవరితోనో అంటే, నేనలా పక్కకి వెళ్ళగానే అతనో చాదస్తం మనిషిలెండి అనుకోవడం నా చెవిని పడింది.

పోతనగారైతే కాటుక కంటినీరు అని గబగబా ఒక పద్యం అందుకుంటారు.నేను అంతటివాణ్ణి కాను కదా అందుకని అయ్యో ఎంత చిక్కిపోతోందో ఆంధ్రమాత అని వలవల్లాడేను.

అదీ భోగట్టా!

Comments   

 
+1 #6 అమ్మ చిక్కిపోతోంది! Ravi 2014-02-10 10:53
శర్మ గారూ,

మీరన్న- లు, లూ, (ఌ ౡ) లను ఎనభైలలో అక్షరమాల నుండి తొలగించారు.

అదే విధంగా, కృతజ్ఞత కూడా, క్రుతగ్నత గా మారిపోతోంది.

రవి
Quote
 
 
+1 #5 RE: అమ్మ చిక్కిపోతోంది! IVNS 2011-09-30 10:39
ఈ కాలపు ఒక ప్రముఖ యువ నటుడు కాల్లు, pelli , కల్లు అంటే అదే సరైనా ఉచ్చారణ అని మన తెలుగు యువత అనుసరిస్తున్నార
ఆయన ఎవరో కాదు అల్లు వారి మనుమడు. బహుశః అల్లు లో లు కారణమేమో ళ మరచిపోవడానికి
Quote
 
 
+1 #4 RE: అమ్మ చిక్కిపోతోంది! గోపీనాథశర్మ 2011-09-30 10:31
సంస్కృత వ్యాకరణము మేరకు "శం" ను "షం" అనే పలకాలి. ఉదాహరణకు వేంకటేశ అన్నదాన్ని వేంకటేష అనే పలకాలి. తెలుగువారు 'శ' ను 'స' గా పలుకుతూనే వ్రాసేవేళ వెంకటే'ష్' అను వ్రాయడం జరుగుతుంది. అలా వ్రాయడము వ్యాకరణానికి వ్యతిరేకము. వ్యాకరణము ఎలా నిర్దేశిస్తుందో అలా వ్రాయడము, పలకడమే ఉత్తమము.
Quote
 
 
0 #3 sarkari jyothirmayi 2011-09-20 05:23
తెలుగు తల్లితో పాటు భారత మాట కూడా బాధపది పోతోంది లెండి.
భారతదేషం అ౦టు౦టే విని. ఎంత బాధగా వుంటుందో అలా వినాలంటే. పుస్తకాలు అందునా తెలుగు పుస్తకాలు చదవక పోవడం వాళ్ళ వచ్చిన సమస్యేమో ఇది.
Quote
 
 
0 #2 RE: అమ్మ చిక్కిపోతోంది! ముద్దపప్పు 2011-06-16 18:52
"ఆంద్రమాత"
Quote
 
 
0 #1 RE: అమ్మ చిక్కిపోతోంది! y.sreeramulu 2011-03-30 06:40
aavakaya lo
anni kaalaalu baagunnay
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh