The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

గత ఆరేళ్ళుగా అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవ చేస్తూ, ఉపయోగకరమైన సమాచారాన్ని పొందుపరచడంలో కృషి చేస్తూ సాగుతున్న ఆవకాయ.కామ్ ప్రతి సంవత్సరం ఒక్కో కొత్త అంశాన్ని తనలో ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ దిశగా ఈరోజు చిన్నపిల్లలకై ప్రత్యేకమైన ఆడియో బుక్ ను విడుదల చేస్తున్నాం.

ఆడియో బుక్స్ అన్నవి కొత్త విషయమేమీ కాదు. అలాగే ఆవకాయ.కామ్ లో పిల్లల కోసం ప్రత్యేక శీర్షికను నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ శీర్షికకు మరిన్ని రంగులద్ది, ఈ వేసవి సెలవుల్లో పిల్లల మనోరంజనకై ఏదైనా కానుకను అందించాలన్న తపనతో ఈ ఆడియో బుక్ ను రూపొందించాం. ఈ కథకు మూల రచయిత ఎవరో తెలియదు. కానీ మా బృందం సభ్యుడి వద్దనున్న పుస్తకం ఆధారంగా ఈ ఆడియో బుక్ ను తయారుచేసాం. ఈ ఆడియో బుక్ ను ఆన్‍లైన్ లో వినడమే గాక డౌన్‍లోడ్ చేసుకోవచ్చును కూడా!

మేము ప్రవేశపెట్టిన ప్రతి శీర్షికనూ ఆదరించి, విజయవంతం చేసిన పాఠకులు, బాలల ఆడియో బుక్స్ ను కూడా ఆదరించి, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

ధన్యవాదాలతో

ఆవకాయ.కామ్ బృందం

వినండి....ఆవకాయ.కామ్ సమర్పిస్తున్న తొలి తెలుగు ఆడియో బుక్

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

Attachments:
URLDescriptionDownloads
Access this URL (http://www.newaavakaaya.com/images/stories/Swarna%20Kamalam/Swarna%20Kamalam.mp3)Swarna Kamalam - Telugu Audio Book for KidsSwarna Kamalam - Telugu Audio Book for Kids0

Comments   

 
+1 #5 బాలల ఆడియో బుక్స్ - స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ) పార్థ 2013-05-27 17:55
Interesting attempt. Quality follows commitment.
Quote
 
 
0 #4 బాలల ఆడియో బుక్స్ - స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ) SIVRAMAPRASAD K 2013-05-27 00:08
పిల్లలకు ఆడియో పుస్తకాలు ఒక అద్భుతమైన ఆలోచనే కాని, ఎటువంటి పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, చదివేప్పుడు చదివేవారు చూపించవలసిన భావం, చదివే విషయాన్ని బట్టి గొంతు. చదివే విధానం మార్పు చేస్తే వినటానికి పిల్లలే కాదు ఎవరైనా కూడా ఆకర్షించబడతారు. అందుకనే ఈ విషయంలో నిష్ణాతులైన ఆకాశవాణి కళాకారులను సూచించినది. విజయవాడ ఎ బి ఆనంద్ , పాండురంగ, సుబ్రహ్మణ్య భట్టు గార్లు హైదరబాదులో, సుధామ గారు, రామం గారు, శారదా శ్రీనివాసన్ గారు, తురగా జానకీ రాణి గారు, వెంకట్రామయ్య గారు మొ||లగు వారు ఉన్నారు. వారిని సంప్రదించి వారి చేత కాని, వారి గైడెన్సులోకాని ఈ పని చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగులో నాకు తెలిసి ఆడియో పుస్తకాలు లేవు. ఒక్కటే ఒక్కటి గొల్లపుడి మారుతి రావుగారు స్వీయ రచనను చదివినది తప్ప. కాబట్టి ఆంగ్లంలో ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి డిక్షన్ తో చదువుతున్నారు, ఎలాంటి ఉచ్చారణ (నా ఉద్దేశ్యం ఆ యాక్సెంట్ కాపీ కొట్టమని కాదు) చేస్తున్నారు, మొత్తం మీద చదివే పధ్ధతి నిశితంగా పరిశీలించి కొంత ప్రాక్టీస్ చేసి నిపుణుల ఆధ్వర్యంలో ఈ పని చేస్తే బాగుంటుంది. కాని ప్రతి దానికి లిమింటింగ్ ఫాక్టర్ నిధుల కొరత ఉండనే ఉన్నది. చేతనైనంత చెయ్యగలిగినది చేసేసి ఇంతకంటే ఏమి చెయ్యగలం అని స్వాంతన పొందటం సులభమైన పనే కదా మరి.

ఇక భాష. తెలియని మాటలు ఈ ఆడియో బుక్సులో విని నేర్చుకోవటం అనేది జరగదు. వ్రాత పుస్తకాల్లోనే జరగనిపని, ఇలా కాజువల్గా వింటూ ఉంటే జరుగుతుందా అంటే అనుమానమే. ఒక్క పిల్లల కథలే కాదు ఏ కథలోనైనా సరే కథాంశం బట్టి, సందర్భాన్ని బట్టి కాకుండా ఆ పదాలు తెలుసు కాబట్టి వాడేస్తున్న మాటల వల్ల భాషకు చెప్పలేని అపకారం జరుగుతున్న విషయం గమనించుకోవాలి. అప్పటిదాకా తెలుగువారయ్యి ఉండి ఇంకా తెలుగును సామాన్య మాటల్లోనే తెలిసిన వారు కూడా పెద్ద పెద్ద మాటలు ఈ కథల్లో చొప్పిస్తే మొదట సందర్భ శుధ్ధి లేక ఆ మాటలు పేలవంగా ఉండటమే కాక, చదివే వారిని భయపెడతాయి. ముఖ్యంగా పిల్లలను. అన్నప్రాశన రోజే ఆవగాయ పెట్టం కదా. అందుకని రచనలు చాలా సరళమైన భాషలొ ఉండాలి. అందుకే చందమామ కథలను ఉదహరించింది. అవి కూడా కొడవటిగంటి కుటుంబరావుగారి సంపాదకథ్వంలో 1960 లనుంచి 1979 వరకు వచ్చిన చందమామలు చూడండి ఎంత చక్కటి భాష ఉంటుందో. అందుకనే పిల్లలు చందమామను అంత ఇష్టంగా చదివి ఆదరించారు. అలా ఆ చందమామకథలను చదువుకున్న వారికి తెలుగు చక్కగా రావటమే కాక తెలుగు భాష మీద ప్రీతి కలిగి మరింత నేర్చుకున్నారు. పిల్లలకు నేర్పెయ్యాలన్న ఆశయం మంచిదే కాని. అలా హడావిడిపడి పదకోశం నుంచి మాటలు పట్టుకొచ్చి అక్కడక్కడా కథల్లో అవసరం ఉన్నా లేకున్నా కూడా వెదజల్లితే జరిగే ఉపకారం ఎంత ఉంటుందొ తెలియదు కాని, అపకారమే ఎక్కువ అని నా అభిప్రాయం.
Quote
 
 
0 #3 బాలల ఆడియో బుక్స్ - స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ) Raghothama Rao 2013-05-26 11:12
శివరామప్రసాద్ గారు,

మీ విశ్లేషణ బావుంది. సమయాన్ని వెచ్చించి వ్రాసినందుకు ధన్యవాదాలు.

చక్కటి గాత్రం కలిగి, స్వచ్ఛందంగా పనిచేసే ఇష్టమున్న వాళ్ళు పూనుకుంటే మంచి ధ్వనిపుస్తకాల్న ి తీసుకురావచ్చు. అలాంటి వారెవరైనా మీకు తెలిసివుంటే చెప్పి చూడండి. ప్రచురించడానికి ఆవకాయ ఎప్పుడూ ముందుంటుంది.

ఓ పాతికేళ్ళ క్రితం వరకూ కూడా ఇప్పుడు క్లిష్ట పదాలనుకున్న వాటిల్ని "బాల భాష"గా వాడేసేవారన్నది నిష్టుర సత్యం.

మీరన్న సులభ భాష గురించి మొదట అనుకున్నా ప్రింట్ లో ఉన్నది ఉన్నట్టుగా చదవడం జరిగింది. అందుకు నేననుకున్న కారణం - ఆవిధంగానైనా పిల్లల్లో తెలుగు పదకోశాన్ని పెంచుకునే ఆసక్తిని పుట్టించవచ్చునే మోనని! అలాంటి వారు నూటికి ఒక్కరున్నా చాలన్న ’యదృచ్ఛాలాభ సంతృప్తి’ కూడా ఒకానొక కారణం. ఆ ఆసక్తి లేని వారికి, నిజమే, దూరం కావడమొక్కడే సులువైన మార్గం :-)

మరిన్ని సూచనలు, సలహాలకై ఎదురు చూస్తూ...
Quote
 
 
0 #2 బాలల ఆడియో బుక్స్ - స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ) SIVARAMAPRASAD.K 2013-05-26 10:12
బుక్ ఆలోచన బాగున్నది. ఒక కథను చదివి వినిపించటం అనేది అంత సులభమైన పని కాదు.అందునా ఆ మనిషి ఎదురుగా లేకుండా మెప్పించగలగటం చాలా కష్టమైన పని.

నా ఉద్దేశ్యంలో, ఈ పనిని సర్ధవంతంగా నిర్వహించగలిగిన వారు, రిటైర్ అయ్యిన ఆకాశవాణి కళాకారులు. అటు హైదరాబాదులోనూ, ఇటు విజయవాడలోనూ ఎంతోమంది దశబ్దాలపాటు ఆకాశవాణిలో పనిచేసిన అనుభవం కలవారు ఉన్నారు. అలాంటి అనుభవజ్ఞులు కథలను చదివి వినిపిస్తే ఎంతైనా బాగుంటుంది.

పిల్లలకు కథలు వ్రాసేప్పుడు వాడవలసిన భాష చందమామ కథలు చూసి ఆ విధంగా వ్రాస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ కథలో "సాధ్వి" అనే మాట వాడారు. అంటే ఏమిటి అని అడిగితే అర్ధం చెప్పటం సులభం కాదుకదా. అందుకని పిల్లలకు ఎంతవరకూ అర్ధమవ్వాలో విషయాన్ని అంతవరకూ అర్ధమయ్యే పదాలనే వాడాలి. వాళ్ళకి చెప్పాలన్న తొందరలో వయస్సుకు మించిన మాటలను వాళ్ళకు చేర్చటం వల్ల కథను వినే ఆసక్తి వారు కోల్పొయ్యే ప్రమాదం ఉన్నది.

ఇక రికార్డింగు విషయంలో మరింత శ్రధ్ధ తీసుకుంటే బాగుంటుంది.
Quote
 
 
0 #1 బాలల ఆడియో బుక్స్ - స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ) IVNS 2013-05-25 15:57
రఘోత్తమ రావు
కధ కళ్ళ ముందే జరిగినట్లు చక్కని వాచ తో రసవత్తం గా చెప్పారు రఘోత్తమ రావు .
ఇలా మన పురాణాలలోని కధలను కూడా రఘుగారు తత్వ సహితం గా చెబితే మన తెలుగు జాతికి ఒక గొప్ప మేలు చేసిన వారౌతారు.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh