The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 4
PoorBest 

డేటింగ్

సహజీవనం, డేటింగ్ మాటలు ఈ రోజుల్లో సర్వసాధారణ మాటలు అయిపోయాయి. టీ,కాఫీ, టిఫిన్ లానే ఇప్పటి కుర్రకారికి డేటింగ్ కూడా జీవితం లో ఒక భాగమయింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా వ్యాపించింది. బాద్యతలు లేని ప్రేమ అని నిర్వచనం చెబుతున్నారు. ఈ మద్య సహజీవనానికి సుప్రీం కోర్ట్ కూడా ఆమోదం తెలిపిందట. 

నాకు తెలిసిన చాలా మంది వివాహితులు వారి జీవితం లోని అసంత్రుప్తి ని చూసాను.అలాగే సహజీవనం చేస్తూ సంతోషంతో ఉన్నవారూ వున్నారు. ఏది నిజం? ఏది నిజం కాదు?

ఇంతకూ విషయమేమిటంటే - "డేటింగ్ పై మీ అభిప్ర్రాయం ఏమిటి?" అని నాకు తెలిసిన కొంత మంది ని అడిగాను సరదాగా. కొంతమంది తెలుగు అబ్బాయిలను అడిగాను. "టైం పాస్ కైతే పర్వాలే"దట. తెలుగు అమ్మాయిలు ఆయితె "మనకు అంత సీన్ లేదు భాయి!" అని జవాబిచ్చారు. మరి కొంత మంది సౌత్ మిత్రుల్ని అడిగాను. "whats wrong?" అన్న వాళ్ళూ వున్నారు. కొందరమ్మాయిలు "పెళ్లికి రెడీ ఐతేనే డేటింగ్ కు ఓకే అంటాం" అన్నారు. ఒకానొక నార్త్ మిత్రుర్రాలైతే ఇది పెద్ద విషయమే కాదన్నట్ట్లు సోడా పంచింది.

ఇటీవలే ఇటువంటి ఒక పెళ్ళిలో అమ్మాయి తరుపున నేను సాక్షి సంతకం చేసాను. ఇప్పటి వరకు అయితే వాళ్ళు బాగానే వున్నారు. కాలం మారిపోతుంది. మన జీవన శైలీ మారింది. ఇంకా మారుతుంది. ఇంకా 10సంవత్సరాల తర్వాత మన సమాజం ఎలా వుంటుందో మన ఊహ కు అందని సంగతి.


కృష్ణదేవరాయలది ఏ కులం?

ఈ మధ్య ఒక తెలుగు సినిమా వచ్చిందట. దాని పేరు దేవరాయ. ఇక మన వాళ్ళ ముసుగులు చించుకోవటం మొదలు పెట్టారు. "రాయలు మా కులపోడు" అంటే "కాదు, మా కులపోడు" అని.

ఊరేగింపులు,కోపాలూ తాపాలూ .....

నాకో అనుమానం , ఆ ఊరేగింపు లోని వారల్లో ఎంత మందికి రాయల గురించి తెలుసు? ఆయన ఎప్పుడు జన్మించారు? ఆయన ఏమి చేసారు? నిజానికి ఫలానావారు మన కులపోడు అని చెప్పుకోవడం ఎంత సబబు అనంటారు? సరె వాళ్ళ రీజన్స్ వారికి ఎలాగూ వుంటాయి అనుకోండి! 

మన గురించి చెప్పుకోడానికి ఏమిలేని వాడే నేను ఫలానా వారి కొడుకుని అని పరిచయం చేసుకొంటాడు, అదీ లేనివాడు ఫలానా ఫలనా వాడికి సోదరుణ్ణి అంటాడు, అదీ కుదరనప్పుడు ఆ పెద్దమనిషికి అల్లుణ్ణి లేదా మేనల్లుణ్ణి అని తన పరిచయం చేసుకోంటాడూ అట! అదీ కుదరనప్పుడు "నేను ఫలానా వీరుడి లేదా హేరో గారి కులపొణ్ణి" అని తన పరిచయం చెసుకుంటారు తన గురించి ఏమి లేని కొందరు మహానుభావులు. వీరిది పాపం కీర్తి కోసం క్రాస్ రోడ్ అన్నమాట. 

ఇప్పుడు మనకి అర్జెంటుగా మనుషుల్ని మనసుల్ని కలిపే తనం కావాలి.


 

Comments   

 
0 #2 యాదవకుల సూర్యుడు శ్రీకృష్ణ రాయలు CHENNUBOINA VENKATES 2017-12-18 15:07
Yadava kula Surya

page 179

No 38.

Nanjangud Taluk

1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha
2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam
3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra
4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu
5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba
6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)par anarisahodara
7.sauchavira(sa rvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari
8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de
9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya
10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina
11.varanesi Gajaranyakshetr a Rajaraja purvada Talakadali sri mahadevadevo
12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolagan egado ........


Translation -----------

Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padman abha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :.............. ............... .Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(ch ief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............


Note ----

-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............

Annual Report of the Mysore Archaeological Department for the 1930
University of Mysore ,
Banglore
1934.
Quote
 
 
+3 #1 డేటింగ్ -రాయలవారిది ఏ కులం? IVNS 2013-04-20 06:48
డేటింగ్-సామాజిక న్యాయం !!

అమ్మాయి : డేటింగ్ కు నేను రెడీ కాని నాకు సామాజిక న్యాయం జరుగకపోతే పొతే ఒప్పుకోను

అబ్బాయి : డేటింగ్ కు సామాజిక న్యాయానికి లింకు నాకు అర్ధం కాదు

అమ్మాయి: నీకు రాజకీయ పదజాలం భావజాలం తెలియదు కాబట్టి నీతో డేటింగ్ కి నేను నో

అబ్బాయి : మన డేటింగ్ కి వాటికి లింకు ఏంటి?

అమ్మాయి: అంటే నీకు నిజంగా ఈ లింకు గురించి తెలియదా?

అబ్బాయి : తెలియదు మొర్రో అంటే వినవె

అమ్మాయి : అయితే నీతో డేటింగ్ కి రెడీ
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh