The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

చాలారోజులైంది ఈ శీర్షకను ముందుకు నడిపి. ఈ రాతల్ని చదువే చదువర్లు "విరహము కూడా సుఖమే కాదా!" అని ఎదురుచూస్తున్నారో లేక "పోతే పోనీ పోరా!" అని విసుక్కున్నారో తెలీదు!

ఏదైనా సరేనంటూ...పదండి ముందుకు పదండి చదువుకు అంటూ సాగిపోతాను.


బచ్చన్ గారి ఔదార్యం 

నిన్నటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకు ఉదయం షూటింగ్ ఉంటే సాయాంత్రం సెట్ పైకి వచ్చెవాడట.  కానీ బాలీవుడ్ బాద్‍షా అమితాభ్ బచ్చన్ మాత్రం ఎప్పుడూ ఒక్క నిముషం కూడా లేట్ గా సెట్ కు రాలేదట! అంటే దానర్థం చాలా డిసిప్లైన్ క్యారక్టర్ అనేగా! అంతటి స్త్రిక్టునెస్సు, డిసిప్లైనూ ఉన్నాయి గనుకనే మన నందమూరి అందగాడి పేరుతో పెట్టిన జాతీయ అవార్డుకు ఎంపికై, నిన్ననే ఉగాది రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకొన్నాడు.

ఐతే నేటి రూమరేమిటంటే -  మొన్నామధ్యన బీహర్ పోలీసు వాళ్ళు అమిత్ గారి ఫోటోను వక ప్రకటన కోసం ఆయనకు చెప్పకుండా వాడుకున్నారట. మన డిసిప్లైన్ పిత ఐన బచ్చన్  గారికి కోపం వచ్చింది. డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఫోటో వాడటం ఆయన దృష్టిలో నేరమైనది. చివరికి పోలీసువారు అమితాబు వారి బొమ్మ తమ ప్రకటన నుండి తొలగించారు. అంతేకాదు క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు.

అసలు అమితు మహాశయుడు సినిమా వేషాల కోసం తిరుగుతున్న రోజుల్లో హాస్యనటుడు మహమూద్ తన ఇనంట్లో ఆశ్రయం ఇచ్చి, తెలిసిన వారికల్లా రికమండ్ చేసి వేషాలు ఇప్పించాడు. వకసారి అమితుడి తండ్రి ప్రముఖ కవి హరి వంశ్ రాయ్ కాలు విరిగి హాస్పిటల్ లో చేరితే మహమూద్ వెళ్ళి పలకరించి వచ్చాడు. ఇది జరిగిన వారానికి ఆకస్మితంగా మహమూద్ కు అదే హాస్పటిల్ లో బైపాస్ సర్జరి అయినది. తండ్రి కోసం వచ్చిన అమిత్ బాబు కనీసం తనకు అన్నం పెట్టిన మహమూద్ ను పరామర్శించడానికి సైతం వెళ్ళ్లేదట. "అతను రాకపోతే పోయే...కనీసం ఒక పువ్వు పంపినా సంతోషించేవాడి"నని మహమూద్ వాపోయాడు.

"పరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాదురా పెద్దమనిషి అంటేనే బుద్ధులన్ని వేరురా" అని ఎవరో అనలేదు...మన పరమానందయ్య శిష్యులే చెప్పారు. సర్లేండి....అమీతు దాదాకి అవార్డొచ్చిందని మనమూ రెండు చెప్పట్లు కొట్టేద్దాం!

 


సర్దార్జీ భార్య విలాపం

పాజీ ఇక్బాల్ సింగ్, పఠాన్ పీర్ సాహెబ్ మరియు పండిత్ రఘురాం - ఈ ముగ్గురూ భలే జిగరీ స్నేహితులు. ప్రతిరోజూ కలిసి లంచ్ చేసేవారు. రోజూ వకే రకం భోజనం చేసీ చేసీ విసుగు వచ్చి "రేపు కూడా ఇదే రకం వంట వస్తే ఈ 9వ ఫ్లోర్ నుండి పడి చచ్చిపోదాం!" అని నిర్ణయించుకున్నారు.

ఆ మరుసటి రోజూ తమ లంచ్ బాక్సుల్లో రోజువారీ వంట వుండడమే చూసి ఆ ముగ్గురూ అనుకున్నంత పనీ  చేసేసారు. పఠాన్, పండిత్ భార్యలు వారి వారి భర్తల పై పడి "వంట గురించి వక్క మాట ముందు చెప్పి వుంటె మీకు ఇష్టమైనట్లుగా చేసేదాన్ని కదా?" అని రోదించసాగారు.

పాజీ గారి భార్య ముక్కు చీదుకుంటూ "నాకు ఆ అవకాశం కూడా నా సర్దారు ఇవ్వలేదే!" అని దొర్లి దొర్లి ఏడ్వసాగింది. మిగిలిన ఇద్దరూ "ఎందుకూ?" అని ముక్కారు. 

"నా సర్దార్జీ తన వంట తనే చేసుకునే వారు కదా!?!" అని మళ్ళీ తన భర్త వంటాత్మహత్య పై కన్నీటి మేఘాల్ని వర్షించింది సర్దారిణి.

అయ్యా! అదీ సంగతి!


 

Comments   

 
0 #1 బచ్చన్ గారి ఔదార్యం - ఒక సర్దార్జీ భార్య విలాపం IVNS 2013-04-13 08:00
పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరే !! ఇటువంటి నిజాలు నిప్పులా ఉంటాయి. కౌన్ బనేగా కరోర్ పతి అనే ప్రశ్నకు అర్ధం భారతీయులకు అందరికీ తెలుసు. గంభీర మైన వాచ, ఒడ్డూ పొడుగూ పైగా జై, విజై నామాలతో సినిమాలు, చాలదా ఇది పెద్ద మనిషి కావడానికి !! ఒక్కటి మాత్రం నిజం డబ్బు సంపాన్దించే కొద్దీ చాలామంది పీనాసులు అయిపోతారు !! రిక్షావోడి కి ఉన్న దాన గుణం చూద్దామన్న కరువే ! ఏమో లెండి గుప్త దానాలు చేస్తున్నాడేమో !!
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh