వాడు
రాత్రి బాటసారి అవతారమెత్తి
చేదుపాట పాడుకొంటో
సమస్యల్ని తోలుకొంటో
అవతలి గట్టుకు
వాడు
మానవుడా?
మిథ్యావాదా?
ఆశాదూతా?

ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ
శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ
జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు
ఉన్మాదా?
భిక్షువా?
సాహసా?

నీడల్లో తేడాలుంటాయా?
పేదల్లో వాదాలొస్తాయా?
దేని కొరకిన్ని వ్యత్యాసాలు?

చరిత్రలు, ప్రతిజ్ఞలు
అభ్యుదయానికి రథచక్రాలా?
నిజంగానే!
నిజంగానే!