User Rating:  / 1
PoorBest 

 

వాడు
రాత్రి బాటసారి అవతారమెత్తి
చేదుపాట పాడుకొంటో
సమస్యల్ని తోలుకొంటో
అవతలి గట్టుకు
వాడు
మానవుడా?
మిథ్యావాదా?
ఆశాదూతా?

ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ
శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ
జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు
ఉన్మాదా?
భిక్షువా?
సాహసా?

నీడల్లో తేడాలుంటాయా?
పేదల్లో వాదాలొస్తాయా?
దేని కొరకిన్ని వ్యత్యాసాలు?

చరిత్రలు, ప్రతిజ్ఞలు
అభ్యుదయానికి రథచక్రాలా?
నిజంగానే!
నిజంగానే!

 

Comments   

 
0 #1 నిజంగానే! IVNS 2017-06-20 07:50
శ్రీ శ్రీ నిజ స్వరూపమా (కమ్మీల ప్రభావం లేని ) ఈ స.తె. జీ
లేదా స.తె. జీ ఒక కొత్త కవా !!
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh