The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 4
PoorBest 
మరణం

నిజంగా మరణం
 
నీ సమస్తేంద్రియాలను ఒప్పచేప్పేసేంత

మంచి కలేమిటోయ్.


*******

టోల్ గేట్

మేఘాలకు
 
టోల్ గేట్

ఆ కొండ.


******

కాలం

పోటీ పడే అవకాశం

ఎవరికిచ్చింది గనుక ఆ కాలం

ఓడింది గెలిచింది అనడానికి.


******

మెరుపు సుందరి


చీకటి లోనూ ఆ మబ్బుల గుంపుల్లో
 
దారి చేసుకుంటూ
 
ఎక్కడికి పోతోందా మెరుపు సుందరి?


*******

జోడు


చేతికి  కర్ర సాయమొచ్చే రోజుల్లో
 
కంటికి జతయ్యే జోడు నేడెందుకో
 
పుట్టి మూణ్ణాళ్ళైనా కాకముందే.......

ఎందుకంటావ్?

*******

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh