The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 3
PoorBest 

ఎన్ని భావాలనైనా మోయడానికి

పుష్పకమేమీ కాదోయ్ నా మనసు!

కూడికలు తీసివేతలు నేర్పే

చిన్న బడిలోని నల్లబల్ల

అందుకే ఒకటి చెరిగితే గానీ

ఇంకొకటి దాని మీదకి రాదు మరి

నిజానికి కూడికలు తీసివేతలు అనే

ఈ రెంటి నడుమ నిత్యం జరిగే సంఘర్షణలో

శాంతి విశ్రాంతులు! రెంటినీ కోల్పోయాను నేను

హమ్మయ్య లెక్క సరిపోయింది

రెంటివల్ల రెండే పోయాయి అనుకునే లోపే

చేజారిపోయింది నా జీవన మాధుర్యం

ఐనా ఇంకా తెలుసుకుని తెలివిన పడక

దృశ్యాదృశ్యంగా కొన్ని కూడికల్ని అన్ని తీసివేతల్ని

రచిస్తూనే ఉందా నల్లబల్ల

చేజారిపోతున్న జీవన మాధుర్యం తో తనకు

పనేమిటంటూ?

*********

Comments   

 
+2 #2 skvramesh skvramesh 2012-06-26 14:30
అబ్బా ఏరుకోవడం అనే కళ ఇంత బాగా వచ్చా అండీ తమకి ఏది ఏమైనా మీ ప్రతిభ ప్రపంచానికి ఈ నా కవిత ద్వారా పరిచయమైనందుకు చాలా ఆనందంగా ఉందండి. :D
Quote
 
 
+1 #1 RE: కూడికలు తీసివేతలు muugavaadu 2012-06-26 12:25
ఎన్ని బటాణీలనైనా మొయ్యడానికి
పుష్పకమేమీ కాదోయ్ నా జేబు
చచ్చులు పుచ్చుల ఏరివేతే
నా జేబుకున్న చిల్లులు
ఒక గుప్పెడు ఖాళీ ఐతెనేగానీ
మరో గుప్పెడు వచ్చి చేరదు మరి
నిజానికి చచ్చులు పుచ్చులు అనే
ఆ రెంటి మధ్యన జరిగే నిరంతర వెతుకులాటలో
నమలడం మింగడం! రెంటినీ మర్చిపోయాను నేను
హమ్మయ్య గుప్పెడు నిండిపోయింది
చంటి వల్లే బంటీ పోయాడని అనుకొనేలోపు
చేజారిపోయాయా గుప్పెడు మాధుర్యబటాణీలు
ఐనా ఇంకా ఏరుకుని ఎరుకపడక
అల్లిబిల్లిగా కొన్ని చచ్చుల్ని అన్నీ పుచ్చుల్ని
దాచిపెడుతూనే వుందా జేబు
చిల్లుజారిపోతున్న మాధుర్యబటాణీలతో తనకు
గొడవెందుకంటూ?
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh