The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 4
PoorBest 

చిటపట అల్లరి చేసిన

వాన చినుకులకు

నోరు తెరిచిన బీడు

జోల పాడింది.

****

తాను రాసిన పాటను

పాడడం కోసమని

ఎన్ని గొంతులను మేల్కొల్పిందో

ఆ ఉదయ సుందరి.

*****

ఎంతకాలమలా నిలబడుతుంది పాపమని

తనపై పడిన చెట్టు నీడను

ఊయలలూపుతోందా చెరువు.

*****

అందరూ గుర్తింపు కార్డును

ముందుకు వేసుకుంటే

తానొక్కటే వీపునెందుకో

ఆ మిణుగురు.

*****

Comments   

 
0 #1 RE: బీడు RaviChandra 2012-07-02 05:59
ఎంతకాలమలా నిలబడుతుంది పాపమని,
తనపై పడిన చెట్టు నీడను
ఊయలలూపుతోందా చెరువు.
చదువుతుంటె వూయల లో వూగుతున్నట్టున్ నాయి మీ పదాలు so nice
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh