The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 5
PoorBest 

 

తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.
 
మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు
వాక్కులు విన్నప్పుడల్లా , "ఓ ఫైవ్" కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల "నోటు" మాటలు విన్నప్పుడల్లా, చటుక్కున అక్కడ ముళ్ళపూడి ప్రత్యక్షమయిపోతారు. కాబట్టి, ముళ్ళపూడికి కన్నుమూతా, పెన్నుమూతా లేవు.


 

ముళ్ళపూడి నవ్వుల నావలో ఈ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది? బుడుగుతోనేనా? ఆ నోటు బుక్కు సైజు పుస్తకం, కాస్త పెద్దచ్చరాలు, మధ్యలో బాపు వొయ్యారి గీతల్లో ప్రాణం పోసుకొని వివిధ భంగిమల్లో బుడుగూ, సీగాన పసూనాంబ..చూస్తున్నప్పుడే కాదు, పుస్తకం మూసి, రమణాక్షరాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కన్ను కొట్టినట్టుండే కొంటె గీతలు...అటు నించి వాక్యాల వెంట ప్రాణాలని లాక్కుపోయే రమణ గారి మాటలు...బొమ్మ ముందా, మాట ముందా అంటే ఎటూ తేలని సందిగ్ధం. మొత్తానికి బుడుగు ఒక అనుభవం. మనలోపలి చిలిపితనాలని, కొంటె కోణాన్ని నిద్రలేపే రసార్ణవం. 
 

వాక్యాలు అందరూ రాస్తారు. డయలాగుల లాగులు రైటర్ టైలర్లంతా కుడతారు. కాని, కొన్ని లాగులు అరువు లాగుల్లా వుంటాయి. బరువు మూటల్లా వుంటాయి. కాని, ఈ టైలరు అసలు ఎలాంటి కొలతలూ తీసుకోకుండానే మనసుకి కొలత పెట్టి డయలాగులు కుట్టేస్తాడు.

 

ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడానికి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి.

Comments   

 
+1 #6 RE: తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది! Ram Cheruvu 2011-03-05 01:50
అఫ్సర్ గారు,

చాలా బాగా రాసారు.. మళ్ళీ రమణగారు పొయిన విషయం గుర్తు తెచ్చి కన్నీళ్ళు తెప్పించారు...
Quote
 
 
+1 #5 spandana mohanramprasad 2011-03-01 09:14
రమణలేని
చిర్నవ్వుల ప్రపంచం
చిన్నబోయి0ది.

మాటలమూట
మనకొదిలిపెట్టి
పెన్నుమూసాడు.

బుడుగు నాన్న
బయటకు వెళ్ళాడు
ఏమి చెప్పాలి?

వెతుకుతో0ది
మా రె0డుజెళ్ళ సీత
ఉన్నట్టు లేరు!

అఫ్సరా ...రమణగారు వొదిలిన పెన్ను లేనట్ట్లుగా ఉంది.
Quote
 
 
+3 #4 RE: తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది! Bhaskar Rayavaram 2011-02-25 15:12
అఫ్సర్ గారు,రమణ గారికి మీ అక్షర నివాళి చాలా బాగుంది.. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు.. వారి పుస్తకాలలోని జీవిత సత్యాలని, భాషా సౌందర్యాన్ని మన పిల్లలకి రుచి చూపించి..వాళ్ళల ో నిద్రాణమై ఉండే రమణల్ని మేలుకొలుపడమే మనం వాళ్లకి ఇచ్చే నిజమైన నివాళి కాబోలు..
అన్నట్లు, మీ ఆవకాయ వద్దనకూడా అధ్బుతం!
Quote
 
 
+1 #3 RE: తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది! Saikiran Kumar Kondamudi 2011-02-25 10:46
Best tribute that I have read in the net.
Quote
 
 
+1 #2 బాతాఖాని-లక్ష్మ ిఫణి కబుర్లు భమిడిపాటి ఫణిబాబు 2011-02-25 10:26
"ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడాని కి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి"- --Superb !
Quote
 
 
+1 #1 RE: తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది! Raghothama Rao 2011-02-25 09:55
అఫ్సర్ గారు,

అద్భుతమైన నివాళి.

అక్షరం అక్షరంనూ అనుభవించగలిగాను.

మరో ముళ్ళపూడి రావడం సుదూర స్వప్నం. కదూ!
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh