The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

Capital Woes or Woos!రాష్ట్ర విభజన జరిగిననాటి నుండీ విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు, తిరపతి తదితర పట్టణాల ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, రాజధాని మా ఊరులో ఉండాలంటే  మా ఊరులో ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారి నగరం మీదున్న అభిమానాన్ని కొట్టి పారేయ్యలే౦. కానీ ఇది భవిష్యత్తులో శాశ్వతంగా ఉండే రాజధాని, దీని మీదనే  సీమాంధ్ర ప్రజల రేపటి బాగోగులు ఆధారపడి ఉంటాయి అన్న విషయం గుర్తుంచుకుంటే, కేవలం నగరం మీద అభిమానంతోనో లేక ఇతరత్రా కారణాలవల్లనో  ఈ విషయ౦లో ఓ నిర్ణయానికి రావడం సమంజసం కాదు.

ముందుగా ప్రస్తుత పరిస్థితిని ఓసారి గమనిద్దాం.

 

 1. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అరకొర నిధులొస్తాఏమో కానీ పెద్దగా వేల వేల కోట్లు వస్తాయని ఆశించలేం.
 2. ఆ అరకొర నిధులలోంచే రాజధానికి కావాల్సిన కనీస హంగులు ముందుగా సమకూర్చాలి. అంటే ఓ అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్య మంత్రి, ఇతర మంత్రుల కార్యాలయాలు, MLA Quarters, వివిధ విభాగాల ఆఫీసులు వగైరా వగైరా
 3. విశాలంగా, ప్రభుత్వ విభాగాల కార్యాలయాల ( Government administration area) ప్రదేశం ఏర్పరుచుకోవడానికి కనీసం ఓ వెయ్యి, రెండు వేల ఎకరాల స్థలం కావాలి. వచ్చే ఏభయ్యి, వంద సంవత్సరాల వరకూ ఇదే మన మన రాజధానిగా ఉంటుందన్న విషయం ఇక్కడ మరువకూడదు. ఎక్కడో అక్కడ పెట్టేసుకోవచ్చులే, తరువాత తీరిగ్గా అభివృద్ధి చేసుకోవచ్చు అని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇది ఎందుకు చెపుతున్నానంటే ఈ మధ్యనే ఓ మంత్రి గారు గుంటూరు దగ్గరి నాగార్జున విశ్వ విద్యాలయం ప్రస్తుతానికి ఖాళీ చేయించి రాజధాని అక్కడ పెట్టేదామనే ఛండాలపు ప్రతిపాదన చేసేరు.
 4. సీమాంధ్ర రాజధాని వచ్చే అయిదు –పది ఏళ్లలో కనీసం ఓ రెండు మూడు లక్షల ఉద్యోగస్తులకి ఆశ్రయం ఇస్తుంది. అంటే ఎక్కడ రాజధాని వచ్చినా కనీసం ఓ పన్నెండు లక్షల జనాభా అదనంగా అక్కడికి చేరతారు. ఇప్పటి వరకూ అక్కడ నివసిస్తున్న వారు కాక. ఈ అదనపు జనాభాని అటూ ఇటుగా ప్రస్తుతం విజయవాడ నగరం జనాభాతో పోల్చొచ్చు. ( ఇది నా కనీస అంచనా మాత్రమే. నా ఉద్దేశం ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే సీమాంధ్ర రాజధాని వచ్చే పది ఏళ్లలో ఇరవై –ముప్ఫై లక్షల అదనపు జనాభా ఉన్న నగరంగా  ఎదుగుతుంది).
 5. నేటి విజయవాడ నగరం విస్తీర్ణం వికిపీడియా ప్రకారం 262 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 65 వేల ఎకరాలు.

ఈ ప్రకారం చూస్తే, వచ్చే పదేళ్లలో, కనీస అంచనాల ప్రకారం, సీమాంధ్ర రాజధాని కేవలం 12 లక్షల మంది నివసించే ఓ చిన్న నగరంగా ఎదిగినా దానికి 65,000 ఎకరాల స్థలం కావాలి. ఒక వేళ సీమాంధ్రుల తలరాత బాగుండి రాజధాని మరింత శరవేగంగా ఎదిగితే కనీసం లక్ష, రెండు లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్న నగరం ఔతుంది. అలాంటప్పుడు కొన్ని విషయాలని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.

 1. విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు, తిరపతి తదితర పట్టణాల చుట్టుపక్కల ప్రభుత్వం ఆధీనంలో ఇంత పెద్ద మొత్తంలో స్థలం లేదు.
 2. ఒక వేళ రాజకీయ కారణాల వల్ల పైన ఉదహరించిన ఏ నగరనినైనా రాజధానిగా ప్రకటిస్తే, ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ సేకరణ చెయ్యాల్సి ఉంటుంది.
 3. కనీస  మొత్తంలో ఎకరానికి 2-3 లక్షల రూపాయిల పరిహారం చెల్లించినా , ప్రభుత్వానికి ఇది వెయ్యి, రెండు వేల కోట్ల భారం. విజయవాడ – గుంటూరుల మధ్య రాజధానిని నిర్మిస్తే  ఇవ్వ వలసిన పరిహారం ఈ మొత్తానికి 5-10 రెట్లు కూడా ఉండొచ్చు. అంత భారాన్ని భరించే స్థితిలో రాబోయే ప్రభుత్వం వుండదు. అంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వ సహాయం అందే అవకాశం కూడా లేదు. ముందసలు, పైన చెప్పిన పెద్ద నగరాల చుట్టు పక్కల రైతులు భూ మిని అమ్మడానికి ఇష్టపడక పోవచ్చు. లేదా బలవంతంగా తీసుకుంటే కోర్టుకి వెళ్ళవచ్చు. దాని వల్ల సమస్య మరింత జటిలమౌతుంది.
 4. ఇంకో విధంగా ఆలోచిస్తే భూసేకరణకి వెచ్చించే  సొమ్ము కొత్త ప్రదేశంలో రోడ్లు, sewerage, తాగునీటి పైపులు లాంటి కనీస సౌకర్యాలని ఏర్పరుచుకోవటానికి సరిపోతుంది.
 5. ఎయిర్ పోర్టును కట్టుకోవడానికి , రైల్వే లైనులు వేసుకోవడానికి ఈ డబ్బు చాలు.

ఈ విధంగా ఆలోచిస్తే ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో అక్కడ రాజధానిని నిర్మించడమే అన్ని విధాలా మంచిది. అది ఓ కుగ్రామమైనా పర్వాలేదు. రాజధాని ఒక అయస్కాంతం లాంటిది. ఎక్కడ రాజధాని వచ్చినా అక్కడకి ప్రజలు చేరటం పరిపాటి. ఈ నేపధ్యంలో నా వోటు దోనకొండకే. దోనకొండకి ఉన్న advantages అన్నీ ఇన్నీ కావు.

 1. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో 54 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క ఎకరం కూడా సేకరించ కుండా ఓ విజయవాడని నిర్మించే అవకాశం ఇక్కడ ఉంది.
 2. ఈ వూరు కర్నూలు, విజయవాడ, ఒంగోలు పట్టణాలకి సమాన దూర౦లో ఉంది.
 3. గుంటూరు – గుంతకల్ బ్రాడ్ గేజీ లైన్ ఈ వూరు మించే వెళ్తోంది.
 4. ఒంగోలు జిల్లాలోని ఈ వూరు కర్నూలు జిల్లా సరిహద్దుల నుంచి కేవలం 60- 70 కి.మీ.ల దూరంలో ఉంది. రాజధాని కోస్తాలో ఉండాలా లేక రాయలసీమ లో ఉండాలా అన్న వివాదం తలెత్తితే, కర్నూలు జిల్లా సరిహద్దులని పొడిగించి దోనకొండ వరకూ తీసుకురావటం లాంటి విషయం కూడా ప్రభుత్వం పరిశీలించ వచ్చు.
 5. గుండ్లకమ్మ, నాగార్జున సాగర్ లు ఈ వూరు నుంచి పెద్ద దూరంలో లేవు. రానున్న కాలంలో తాగు నీటి సమస్యని కూడా ఈ విధంగా అధిగమించే వీలుంది.

సీమాంధ్రులందరూరూ స్వంత నగరాల అభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ విషయం ఆలోచిస్తే బావుంటు౦దని నా ఆశ.

* * * * *

Comments   

 
0 #10 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! kadambari piduri 2014-11-28 19:42
ఇన్నాళ్ళు ఓపిక పట్టాక రాజావారి నిర్ణయాలు తెలిసాయి; 'విజయవాడ' - అని;
కొత్త బిల్డింగు కట్టే అక్కర - లేకుండా హైద్రాబాదు- ని అలనాడు ఎంచుకున్నారు.
2) "వెంకటగిరి";
కొమ్ము బొమ్మలకు ప్రసిద్ధి గాంచిన 'పర్లాకిమిడి" వంటివి - (బిల్డింగులు దృష్ట్యా)సరిపోయ ేవి కదా! - అని;
Quote
 
 
0 #9 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! Sudhakar 2014-03-22 14:33
Dear Sir,

Building a capital as annexure to the existing city and also distributing the bureaucrats, offices to all over the state based on the department and requirement will be always better. Similar to Gandhinagar near to Ahmedabad. A total new location will not create any miracles of development, but again causes migration from present existing cities to capital, which is not required. Some people quoting that a capital requires 1,00,000 acres or other wise equal land to Hyderabad. We don't want a new location to create employment. We require employment at all over the state, but not only in capital. At present situation, total creation of employment is in Hyderabad, Vizag. But no other place in the state will not provide proper employment and life standards of the people in those areas are like same as it is like 20 to 30 years back. We dont want this once again. We require the development should be decentalized. Capital means administrative capital along with only key operational departments. High court is no need to be within capital.

In my opinion, Vijayawada along with Guntur should be done as Administrative capital as the same is in the mid of State. High court to be distributed with two benches, one in Uttarandhra and the other in Rayala seems. Departements can be distributed like below:
Ports, Fisheries etc., - North Coastal area
Mines - Rayalaseema
Irrigation - Srisailam, Godavari districts
Roads & Buildings - South coastal andhra/ Rayalaseema
Agriculture - Central Coastal
Quote
 
 
0 #8 where is seemandra rajadhani srinivas L 2014-03-02 14:41
Though we concur with your views but the name of the capital is quite disgusting .try to change the name of the capital
Quote
 
 
0 #7 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! voleti srinivas 2014-03-02 10:40
Dear vishnu,
I read ur article. the capital can be anywhere. the real problem is created what I found during my stay in AP is not by the common man. It is politician who are completely controlling all businesses and they want easy money by creating land mafia. Development comes attitude of the people and their leaders.Simple example .Gujarat and Orissa almost both have same type natural resources. Orissa became independent state in 1930s i suppose where as gujarat in 1950s.. now gujarat can feed 2 orissa states economically. It is not the resources which is really required for development ,but it is the attitude of the leaders of that area. can you quote even single name from seemandhra who is a real hero leader? Hence let us not break our heads, we may enjoy another 20-25 healthy happy diwalis, later we dont know. -srinivas
Quote
 
 
+1 #6 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! JVR Murty 2014-03-01 18:54
I like this article. However, I think time has come to think out of box and explore other smart alternatives. I suggest the following for your thinking;
(i) Seemandhra will be having a population (about 40 + million) which is equal to South Africa (about 50+ million). South Africa has three capitals - not one. Executive capital (Pretoria), Bloemfontein (judicial) and Cape Town (legislative). In the same way Seemandhra can also have three capitals with different functions, thus reducing load on one city and distributing development factor evenly. The land requirement at one place will also be eased out.
(ii) I think the time has also come to think of Public Private Partnerships in design and development of the capitals (I still prefer more than one capital). Most of the infrastructure mentioned here like - roads, airports, water supply, sewerage, office space etc can be developed through a PPP mode, thus reducing financial burden also.

Will be happy to hear your views on this.

Cheers

Murty
Quote
 
 
+2 #5 A.P.CAPITAL M.V.Ramanarao 2014-03-01 18:41
మాది ఉత్తరాంధ్ర ఐనా మీతో చాలా వరకు ఏకీభవిస్తున్నాన ు.రాజధానిని ప్రకాశం జిల్లాలోనే సరి ఐన ప్రదేశంలో నిర్మించడం మంచిది.(మార్కా పురం,దొనకొండ ప్రాంతంలో).సారవ ంతమైన ఖరీదైన ప్రైవేటు భూములున్న గుంటూరు-విజయవాడ ప్రాంతం మాత్రం మంచిదికాదు.నేను చెప్పిన ప్రాంతానికి రాయలసీమ వారికి కూడా అభ్యంతరం ఉండక పోవచ్చును.
ఉత్తరాంధ్ర పేకేజి గురించి (ముఖ్యంగా శ్రీకాకుళం ,విజయనగరం జిల్లాల నాయకులు,ప్రజలు గట్టిగా పట్టు పట్టి సాధించాలి.
Quote
 
 
+1 #4 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! hari.S.babu 2014-03-01 13:49
No, not this news. I have just read a news report that center is thinking about donakonda. I fogot it's date. but It was only report. not supporting even. any way I like this idea. We should not repeat the same mistake of hyderabad.most of the well-Developped states and counties seperated their capitals like this.
Quote
 
 
0 #3 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! Partha 2014-03-01 13:09
I am not from Tirupati or Chittoor Dist but feel that Tirupati might be an ideal place for the capital. If I am not wrong there are two sizeble industrial estaets (Renigunta & Gajula Mandhyam) that stretch between Tirupati Renigunta & Tirupati - Sri Kalahasthi. This whole area could be clubbed together to acquire the land that is needed. I am not sure how many villages & settlements are there but all of them could become a part of this expansion. The industries that are active might be needed to be relocated or allowed to continue depending on their eco-friendlines s. People would lovel to travel to Tirupati as it is being one of the world's most famous pilgrim place. Even for people from other religions it should not be a problem to travel to Tirupati. Seemandhra can have a High Court bench in Visakhapatnam to facilitate people from that part of the state.
Quote
 
 
+1 #2 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! Vishnu Shankar 2014-03-01 12:50
Ref Mr Hari. S. Babu's comment-- i was compelled to write this article after Andhra Jyothy itself carried a piece saying that Vijayawada is best suited to be the capital, which I totally disagree. You can read the same on this link.
http://www.andhrajyothy.com/node/70365
Quote
 
 
0 #1 సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే.. !! hari.S.babu 2014-03-01 12:40
I have already read in AJ that center is planning the same.You gaot form there. I also like this proposal.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh