The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 0
PoorBest 

 లైట్స్ ఆన్...రోల్ కేమరా...యాక్షన్!

కట్ కట్ కట్ కట్..... 

టేక్ ఓకే

చివరి సీన్

త్వరగా త్వరగా

బొమ్మ వచ్చే నెలే బయటకు రావాలి....Film should be released in January....

ఒక సినిమా తీయాలి అనే నా ప్రయత్నం లో అందరికీ అర్ధమయ్యే లాగా సాహిత్యం, సంస్కృతి, విలువలు అని కంగారు పడకుండా బిందాస్ గా కేఫ్ లో రోజు సాయత్రం ఒక చాయ్, సిగెరట్ తాగుతూ మనం మాట్లాడే సాధారణ తెలుగులో మన సంభాషణలు సాగిద్దాం.

నేను ఒక చిన్న ప్రశ్న అడగనా - "మీరు ఒక మంచి సినిమా చూసి ఎన్ని యుగాలు అయ్యింది?"

మనకి ఒక గొప్ప సినిమా చూసే అదృష్టం ఎలాగూ ఉండదు. కనీసం ఒక మంచి సినిమా చూసి ఈ జన్మకి సరిపేట్టుకుందామని అనుకున్నా.

The position of Telugu film industry and the changes that can be made by the people in and around the industry, few reviews of hits and flops, controversies such as who was with who and when and where etc etc which make films run few more days to celebrate the 100 days function. 

  • కృష్ణవంశీ క్రియేటివిటీ -- క్యా బాత్ హై, కల్ హో న హో !
  • రాజమౌళీ స్టాంప్ -- పోస్ట్ స్టాంపు గీంపు ఏదైనా ఉంటే అదే మేలు.
  • No intravel break, there is no Rajamouli.
  • డైనమిక్ వి.వి.వినాయక్ -- సుమోలు, పోరాటాలు లేకపోతే తోచదు.
  • వై.వి.ఎస్.చౌదరి -- I think I should not count him. He is out of films.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏ కొద్దిమంది మాత్రమో సినిమాలు తీస్తున్నారు...ర్ ర్ ర్..అదే రీమేక్ చేస్తున్నారు. నా వరకూ, హైదరాబాద్ & ఫిల్మ్ స్టార్స్ కు ప్రొడక్షన్ హౌసులకంటే డబ్బింగ్ థియేటర్ల వల్లనే ఎక్కువ డబ్బులు వస్తూండవచ్చు !!

ఏమంటారు ?!?


100 రోజులు 500 సెంటర్స్

ఇవే మన రికార్డులు. మన ఆస్కార్లు!

ఒక సినిమా ఇన్ని రొజులు ఆడగలదా? నిజంగా ఒక మంచి సినిమా అని గుర్తించటం అది ఎన్ని రోజులు ఆడిందో ,అది ఎన్ని సెంటర్స్ లో ఆడిందో, లేక ఆ సినిమ లోని హీరో పలుకుబడో లేక హీరోయిన్ అందచందాలో కారణాలా?

అర్థంపర్థం లేని సినిమా 100 రోజులు ఎందుకు ఆడుతోంది? అభిరుచితో తీసిన సినిమా మనలని మెప్పించ లేకపొతాయి. ఇంకేవో టపోరీ కాన్సెప్ట్ బేస్డ్, టైంపాస్ సినిమాలు మనకి తెగ నచ్చేస్తాయి. ఇవన్నీ జరుగుతోంది మనవల్లే కదా !

వాళ్లు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని మనవాళ్ళ వాదన.వాళ్లు చూస్తున్నరు కాబట్టి మేము తీస్తున్నామని సినిమా వాళ్ల వాదన. సినిమలు ఆడకపోయినా ఆడాయని,అధ్వానంగా వున్న అద్భుతంగా వుంది అని,ఒక్కసారి చూడొచ్చు అని మొహమాటపడుతూ, కోట్లు నష్టపొయినా నోట్ల వర్షం కురిసింది అని పబ్లిసిటి ఇచ్చుకుంటూ దర్శకుడు, నిర్మాతలు, హీరోయిన్లు, రోడ్ల మీద పడి జైత్రయాత్రలు జరుపుకుంటూ తమ తమ సినిమాల్ని సమర్ధించుకుంటూ కాలం గడిపేస్తున్నారు. స్వంత సత్తా సున్నా ఐనా తాతల, తండ్రుల ఫోటోలు ముందెట్టుకుని పబ్బం నడిపిస్తున్నారు.

ఇలాంటి మనకి అవార్డులా, ఆస్కారాలా!!

_@@@@@_

Comments   

 
0 #1 లైట్స్ ఆన్...రోల్ కేమరా...యాక్షన్ ! IVNS 2014-07-10 07:28
నందమూరి బాలకృష్ణ లెజెండ్ 100 రోజుల పండగ ఇంత ఆర్టికల్ మీతో వ్రాయించిన్ది. చూసారా ఇది మన తెలుగు సినిమా సత్తా.

ఎప్పుడు మన సినిమా వాళ్ళు వాళ్ళు నిర్మించుకున్న చట్రం లోంచి బయటపడి, అపారంగా ఉన్న సృజనను ఆహ్వానిస్తారో అప్పుడే భారత దేశం తనకంటూ ఒక అవార్డు ని నెలకొలిపి హాలీవుడ్ చిత్రాలను ఈ అవార్డు పొందడం కోసం పోటీ పడేలా చెయగలదు.

ఐదు పాటలు మూడు ఫైట్ లు రెండు కామిడీ ట్రాక్ లు ఇది మన తెలుగు / భారతీయ సినిమా తనకు తానుగా విధించుకున్న నిబన్ధన. ఎంత హాస్యాస్పదం మన సినిమా పాటల చిత్రీకరణ!! మన పోరాటాల చిత్రీకరణ ?

ఒక్క మాట సారూ , భలే నవ్విస్తాయి మన సినిమాలు. ఇది చాలు అవి అలా వస్తూ ఉండడానికి ...
ఫిజిక్స్ డిఫైఇంగ్ ఫైట్ లు లాజిక్ డిఫైఇంగ్ సాంగ్స్, మొత్తం మీద 2 1/2 గంటల్లో తెరపై గొప్ప మార్పు చూపిస్తే చాలు !
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh