The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

రుడ్యార్డ్ కిప్లింగ్ (Rudyard Kipling, The Jungle Book) రచించిన సుప్రసిద్ధ బాలల నవలిక "ది  జంగిల్ బుక్". అందులో హీరో చిన్నారి మౌగ్లీ. మౌగ్లీని ప్రేమతో పెంచిన జంతువులలో ఒకటి "బాఘీరా" (వ్యాఘ్రము/ बाघ - అనే సంస్కృత పదము మూల ము).  బఘీరా నల్లని చిరుత పులి. (ఈ పెద్ద గండు పిల్లి బాఘీరా తో, బాలూ, కా, మౌగ్లీ. మిత్రులు "The out song" తీయనైనది).

“జంగిల్ బుక్”లో బాఘీరా/ వ్యాఘ్రము- కొంత ప్రత్యేకమైనది. బాఘీరా మన దేశములోనూ, తూర్పు , ఆగ్నేయ ఆసియా దేశాలలో సంచరించే నల్లటి చర్మం కల పెద్ద గండు పిల్లి అని చెప్పవచ్చును. 

******

సరే! ఈ వ్యాఘ్రం సంగతితో ఇంకొక ముచ్చట- పులులలో వేరొక జాతి పాంధేరా. పాంధేరా ప్రాచీన లాటిన్ వర్డు. మళ్ళీ ఈ పదానికి మూల ధాతువు గ్రీకు మాట ఐన "పాంథేర్", అంటే పెద్ద మచ్చలు గల పిల్లి" అని అర్ధం. ఈ గ్రీక్ మాటకు"pan"= మొత్తము : "thEr= అడవి మెకము. పాంధేర్/ పాంధేరా;- మొట్టమొదట ఈ పేరును వర్ణించినది- జర్మనీ వ్యక్తి. 1816 ల నాటి “ఓకెన్” అనే జర్మనీ ప్రకృతి పరిశీలకుడు తెలిపాడు. 

అలాగే పోకాక్ (1916)అనే బ్రిటీష్ శాస్త్రవేత్త – ఈ విభాగానికి చెందిన పట్టికను ఏర్పరిచాడు. పాంధేరా- పులి జాతికి చెందినది. పాంధేరా  క్లాసుకు చెందిన జంతువుల గొంతులు భీతి గొలుపుతవి. వాటి ధ్వనులు చిన్న కూతలుగా ఉండవు. కొన్ని మైళ్ళ దాకా వినిపించేలా భీకరంగా గర్జిస్తాయి. ఐతే ఈ పట్టికలోని “మంచు పులి” (snow leopard) మాత్రము అలాగ గర్జించలేదు. (పాంధేరా జాతిలోనికి 2008 లో IUCN assessors అనుమతించింది.)

*******

ప్రస్తుతం "పింక్ పాంధేర్"/ " పింక్ పాంధేరా" గురించి పరికిద్దాము. ఈ "Pink Pandher" ఎక్కడి నుంచి ఊడిపడ్డది?నిజానికి ఇది కల్పిత పాత్ర. ఇది కార్టూన్ బొమ్మ. నేటి యనిమేషన్ కదిలే బొమ్మల కబుర్లులో పింక్ పాంధేర్ కి కూడా ఒక ఆసనం ఏర్పడింది. 

"ఫింక్ ఫంథెర్" కామెడీ మూవీలు ప్రేక్షకులను బాగా నవ్వించినవి.  ఫ్రెంచ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ జాక్స్ క్లౌస్యో ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారి. పింక్ పాంధేర్ కార్టూన్ బొమ్మ ఈ సిరీస్ కోసమని సృష్టించబడినది.

1963 లో "The Pink panther" అనే ఇంగ్లీషు ఫిల్మ్ వచ్చినది. పీటర్ సెల్లర్స్, బ్లేక్ ఎడ్వర్డ్స్ మున్నగు వారు తెర వెనుక కృషీవలులు.

పింక్ పాంధర్ యానిమేషన్ కారెక్టరు అంతర్లీ నం గా ఉన్న వెండితెర బొమ్మలుతో 1963 నుండి 2009 వరకు రమారమి డజను చలనచిత్రాలు వచ్చినవి. టెలివిజన్ ప్రసారాలు, వెండితెర రూపాలు- ఇన్ని నిర్మితమైనవీ అంటే ఈ గులాబి పాంథర్ ఎంత క్రేజ్ గడించినదో బోధపడ్తూన్నది కదూ!

********

ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకని వచ్చింది!?! 

2007నవంబర్ లో థియేటర్ లలో రిలీస్ ఐనది "పింక్ పాంధేరా 2" వెండితెరను చేరిన ఈ "The Pink panther– 2" చలనచిత్రములో నటించిన భారతీయ భామ ఎవరో తెలుసా? చిటికెలో కనిపెట్టగలరు, ఆమె అందాలతార బాలీవుడ్ యాక్ట్రిణి ఐన ఐశ్వర్యారాయ్ బచ్చన్.

*******

నవంబర్ 1, 1973 న మంగుళూరులో జన్మించిన అమ్మాయి ఐశ్వర్యారాయ్ "The Pink panther – 2"లో నటించింది. చిత్రమేమిటంటే ఆమె ఇందులో నేరపూరితవాతావరణములోని మగువగా నటించడము. “సోనియా స్లాండెర్స్"  అనే అపరాధినిగా ఆమె నటించినది. ఐతే  అలాంటి role లో కూడా స్వాభావికమైన సాత్వికత ఆమె వదనమును అంటిపెట్టుకునే ఉంది. అఫ్ కోర్స్! ఆమె (Fans) అభిమానుల మనసులను చివుక్కుమనిపించింది అనుకోండి.

"దేవదాస్" లో పార్వతి వంటి అనేకము ఆమె సున్నిత భావద్యోతకమైన నటనా రాజ్ఞి గా నిరూపించినవి. మరి ఇలాగ ఇలాటి కొత్త క్రైమ్ కథాంశ సంవిధానంతో కూడిన పాత్రలో ఆమె అగుపిస్తే ఫ్యాన్స్ కి నచ్చదు కదా! ఐనప్పటికీ, ఆమెకోసం ఇండియాలోని సినిమాహాలుకు ఒకసారి వెళ్ళి, ఆడియన్సుగా ఈ పిక్చర్ ని కాస్త ఎంజాయ్ చేయొచ్చు. ఔనా!

********

గులాబి పాంధేరా; / పింక్ పాంధేరా;(The Pink panther – 2/ Panthera ) డిజ్నీ కార్టూనిస్టు సృష్టికర్తల- బాఘీరాకు మక్కికి మక్కీగా ఉంటే ఆడియన్సు ముక్కు చిట్లిస్తారు అనుకున్నారు కామోసు! అంతేకాకుండా కాపీరైట్సుకు సంబంధించిన సమస్యలను గూర్చి కొంచెం యోచించి ఉన్నారేమో గానీ- భీకరమైన గండుపిల్లి, చిరుత జాగ్వార్ చర్మపు రంగు నలుపుకు - బదులుగా, భిన్నంగా రూపొందించారు. అంతే కాదు, ఈ లేత గులాబీ వర్ణంలో చిరుత(చిన్న)పులి స్థానంలో మామూలు పెద్ద పులినే తీర్చిదిద్దారు. 

*******

బాఘీరాకు మక్కికి మక్కీగా ఉంటే ఆడియన్సుకు ముక్కు చిట్లిస్తారు అనుకున్నారు కామోసు! అంతేకాకుండా కాపీరైట్సుకు సంబంధించిన సమస్యలను గూర్చి కొంచెం యోచించి ఉన్నారేమో గానీ- భీకరమైన గండుపిల్లి, చిరుత జాగ్వార్ చర్మపు రంగు నలుపుకు - భిన్నంగా రూపొందించారు. అంతే కాదు, ఈ లేత గులాబీ వర్ణంలో చిరుత, చిన్న పులి స్థానంలో మామూలు వ్యాఘ్ర రాజమునే తీర్చిదిద్దారు. ఏమైతేనేమి, ఈ లేత గులాబీ వన్నె వ్యాఘ్ర రాజము కాస్తా ఆబాలగోపాలానికీ నచ్చేసి, ప్రపంచవిహారిణి ఐనది కదా!   

********

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh