The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

'ఉండమ్మా బొట్టు పెడతా' సినిమా 1968లో విడుదలైన మంచి చిత్రం. ఈ సినిమాలో కృష్ణ, జమున, జానకి, నాగభూషణం, ధూళిపాళ, ఇత్యాది తారాగణం ఉన్నారు. సంఘానికి  పునాది కుటుంబమే కనుక కుటుంబీకులు అందరూ క్రమశిక్షణతో, ఏకతాటిపై నడవాలి; సామరస్యంగా, సౌభ్రాతృత్వ, అనురాగాలకు అగ్రాసనం ఇవ్వాలి; నీతి నియమాలకు జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యత పూలదండలో దారమువలె అంతర్లీనంగా ఉండేటట్లుగా వెండి తెరపై జరిగిన చిత్రీకరణ, దర్శకుని ఉత్తమ అభిరుచికి, ప్రతిభకు అద్దం పడుతున్నది.

ఆ చలనచిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాట 

"చాలులే. జాబిలి కూనా!
ఆ కలువ రేకుల కన్నులలో
తుమ్మెద లాడేనా?
ఆ సోగ కనుల రెక్కలలో 
తూనీగ లాడేనా?"ఈ గీతాన్ని మొదట పి.సుశీల పాడారు. కానీ ఆ పాటకు జానకి చేత గానం చేయిస్తే, ఇంకా బావుంటుందని అనుకున్నారు. మర్నాడే ఎస్. జానకిని పిలిచారు.
 ఎస్.జానకి గాత్ర మాధుర్యంతో ఆ పాట మరింత వీనుల విందుగ తయారైనది.


“భావ కవీంద్రా! క్రిష్ణశాస్త్రి గారూ! మీ గేయానికి ఇద్దరి గొంతులు అవసరం అయ్యాయి కదండీ!” అన్నారు “వెంటనే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక పేపరుపై గబగబా ఏదో వ్రాసారు (కారణం – ఆయన అప్పటికే మూగవారు అయ్యారు). ఆ భావకవి కలం కాగితంపై చిలికిన ముత్యాలు ఇవిగో !....

“ఒక మూగపాటకు ఎన్ని మంచి గొంతులు!“ 

సున్నిత మనస్కులైన కవుల వేదనకు కూడా సుందర అక్షరమాలా పుష్పాలుగా విరబూస్తూంటాయి కదా!

“శిధిలాలయమ్ములో శివుడు లేడోయీ!
ప్రాంగణమ్మున గంట మోగ లేదోయీ!!!.....”

ఈ లలితగీతములోని లాలిత్యాన్ని వర్ణించడానికి ఎన్ని వివరణలు సరిపోతాయి?

 

Comments   

 
0 #2 దేవులపల్లి పాటకు రెండు గాత్రాలు Raghothama Rao 2013-03-19 04:00
//“ఒక మూగపాటకు ఎన్ని మంచి గొంతులు!“ //

// "నా గొంతుక అహల్య. ఏ పవిత్ర చరణాల స్పర్శ కావాలో దీనికి" //

ఈ మాటల్ని ఎప్పటికీ మర్చిపోలేను.
Quote
 
 
+1 #1 దేవులపల్లి పాటకు రెండు గాత్రాలు Syamala Kallury 2013-03-18 17:49
ఇది చదివాకా నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది . ఎమ్.ఎ చదివేరోజులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చారని విని మామాష్టారు కృష్ణశాస్త్రి గార్ని (ప్రొ.ఎల్.ఎస్ ఆర్.కె)ని రిక్వెస్ట్ చేసి కలవటానికి వెళ్ళాను. మాకుటుంబాల మధ్య సాహితీ సంబంధం వుండేదని నాకు తెలుసు. మాచిన్నతనంలో మాతాతయ్యగారింటి కి తరచు వారు వస్తూవుండేవారు. నాకంత గుర్తులేకపోయినా పరిచయం చేసుకున్నాను. వెంటనే గుర్తుతెచ్చుకున ి మానాన్నగారినిగు రించి బామ్మగారిగురించ ి అడిగారు. అప్పుడు గూడా అంతా రాసి చూపించటమే. మాటల సందర్భంలో రాశారు, "నా గొంతుక అహల్య. ఏ పవిత్ర చరణాల స్పర్శ కావాలో దీనికి" అని. మళ్ళీ మనం అందరం ఎంత గొప్పవాడని వూహించుకునే కాళిదాసుకి స్పోటకం మచ్చలున్నాయని తెలిస్తే మనం ఎల్లా స్పందిస్తామో అని" ఆయన అప్పుడు రాసిన ప్రతివాక్యంలోను కవితాసౌరభాలు ఇప్పటికీ తల్చుకుంటే గుర్తుకొస్తాయి
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh