User Rating:  / 1
PoorBest 
పొగడల, పొన్నల చెట్ల నీడలలొ;
పొడలు పొడలు ఆ నీడలలోన;
వన భోజనముల సందడి సందడి
 
పిల్లలు, పెద్దలు అందరునూ;
దడులను కట్టి, తడికలు నిలిపిరి;
శిబిరములేసిరి;వంటలు చేసిరి:
కార్తీకముల సందడి సందడి

దడబిడ వచ్చి, చేతులు కలిపి:
పంటలు వేసీ, ఆటల పైరుల చప్పట్లు;
లోక జ్ఞానం ముచ్చట్లు
మంచు మాసముల మంచి కబుర్లు
 
బుడ బుడ ప్లేటుల; ఫలహారాలు,
విందు భోజనము రుచుల హేలలు;
నల భీముల పాకములివండి !
వన భోజనముల సందడి సందడి

గడబిడ  గంతులు, క్రీడల హోరు;
సంతోషాలు మిన్నుల తాకెను:
నింగికి కూడా హుషారు కోరిక;
తాను కూడా ఇట పాల్గొనాలని

Comments   

 
0 #2 వన భొజనముల వేళ ఇది! kusuma 2011-12-03 07:48
Thank you, IVNS గారూ!!
కొన్ని పదాలు అలా ఐతేనే,
కవితకు అలంకారములు ఔతాయి.
Quote
 
 
0 #1 RE: వన భోజన వేళాయెను IVNS 2011-11-23 09:26
ఈ పద ప్రయోగం బాగుందండి :
మంచు మాసముల మంచి కబుర్లు
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh