User Rating:  / 2
PoorBest 
మా చిన్ని కృష్ణుని
మళ్ళీ మళ్ళీ పిలవండి
గోవిందా గోవిందా

గోపాల బాలునికి
గోరుముద్దలు పెట్టండి
గోవిందా గోవిందా

మా ముద్దుల కొండకు
నెయ్యీ  అన్నం పెట్టండి
గోవిందా గోవిందా

మా వెన్న దొంగకు
పప్పు బువ్వ పెట్టండి
గోవిందా గోవిందా

మా కొంటె కన్నయ్యకు
బెబ్బు అన్నం పెట్టండి
గోవిందా గోవిందా
 

***

అమ్మ చేతి బువ్వ
కమ్మనైన ముద్ద
"ఆమ్" అని తినేసి
ఆడుకో కన్నా

***
 
చెట్టు మీద పిట్ట
చక్కనైనదంట  
చుట్టూతా చూసి
ఎగిరిపోయేనంట

***

వాన వాన వచ్చింది
వాకిలి అంతా తడిసింది
వడిగా నీరు పారింది
పడవ సాగి పోయింది

***

ఆకాశంలో ఇంద్రధనుస్సు
ఆహ్లాదం గా ఉంది మనస్సు
ఆశలు తీరా చేయి తపస్సు
నీ ఆనందమే నీకు యశస్సు

***

చల్లని గాలి వీచింది
చక్కలిగిన్తలు పెట్టింది
చక్కని ఊహ తెచ్చింది
చుక్కల కేసి ఎగసింది

***

చెట్లు మాకు  చుట్టాలు
నీడను ఇచ్చే నేస్తాలు
పక్షులకవే ఇళ్ళు
ఫలాలు ఇచ్చే దాతలు

***

దేవుడమ్మ దేవుడూ
గుడిలో ఉండే దేవుడూ
బడిలో కూడా ఉంటాడు
అమ్మ ఒడి గా మారి దేవుడూ
అందరినీ ఆడిస్తాడు
నాన్న భుజమై ఉండి దేవుడూ
లోకాన్నే చూపిస్తాడు

***

Comments   

 
0 #4 RE: తెలుగు బాలలకై పద్యాలు IVNS 2012-10-03 06:14
ధన్యవాదాలు కుసుమ గారు
Quote
 
 
0 #3 బాలలకై కవితలు kusuma 2012-10-03 02:17
తేట తేట తెనుగు పదాలతో
ఆహ్లాదపరిచే కవితలు
IVNS jii!


Quote
 
 
0 #2 RE: తెలుగు బాలలకై పద్యాలు IVNS 2012-09-22 15:39
అంతా గురు కృప.
ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి
Quote
 
 
-1 #1 RE: తెలుగు బాలలకై పద్యాలు Raghothama Rao 2012-09-22 09:55
//అమ్మ ఒడి గా మారి దేవుడూ
అందరినీ ఆడిస్తాడు
నాన్న భుజమై ఉండి దేవుడూ
లోకాన్నే చూపిస్తాడు//


చాలా బావుంది.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh