User Rating:  / 1
PoorBest 
మబ్బుల మెడలో
చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో?
వానదేవుణ్ణి- డమడమ ఉరుముల
జడిపించేదది ఎవ్వరో?
జడి, వానధారల
చిక్కని- మెలికల -
దారుల నేర్పరచిన వారు ఎవ్వరో?
పుడమికి మేల్ కలనేత చీరలను
కట్టిన వారు ఎవ్వరో?
ఆ వలువల మడుగుల
అద్దపు బిళ్ళలు  కుట్టిన
ప్రజ్ఞా-వంతులు ఎవరో?
ఎవ్వరో? వారెవరో?

************

నదీఝరులలో అలల కొసలలో;
నురుగుల ముత్యాల్ చల్లినదెవరో?
ఎవ్వరో? వారెవరో?
పైరు పంటలకు
పచ్చని "పాటల వినిపించేది" ఎవ్వరో?
ఆ గాలిబాలలకు
చక్కని ఈ పని
అప్పగించినది ఎవ్వరో?
ఎవ్వరో? వారెవరో?
ఇన్నీ ఇన్నీ ఇన్నిన్నీ;
ఆ విధాతసృజనల కలిమి చిత్రముల
నిశితముగా గమనించగలిగిన వాడే కద,
ఈ మానవుడు!
ఈ మనిషి పెదవుల
చక్కని చల్లని-
నగవు వరముల నొసగినట్టి
ఆ దైవమ్మునకు
మేమిస్తాము బులిపించేటి బుల్లి వరమ్ములు,
అవే అవే!
ఈ "శత కోటి నమస్సులు"!
"మానవత"కివి మురిపాల ఉషస్సులు!

Comments   

 
0 #3 పచ్చని పాటలను వినిపించేది kusuma 2011-12-30 04:01
రాజుగారు,

నా కవిత, శ్రీ శ్రీ గారి కవితా సామ్యాన్ని

మీ మదిలోనికి తెచ్చినందుకు

చాలా హ్యాపీగా ఉన్నదండీ!
8)
Quote
 
 
0 #2 RE: మానవతకివి ఉషస్సులు! Raghothama Rao 2011-12-19 12:29
క్షమించాలి రాజుగారు,

ఈ రచన కుసుమగారిది.

పొరబాటున నా పేరుతో వచ్చింది.

తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలు :-)
Quote
 
 
0 #1 RE: మానవతకివి ఉషస్సులు! IVNS 2011-12-19 12:08
శ్రీ శ్రీ శైశవ గీతి గురుతుకు వచ్చింది. చాల బాగుంది రఘు గారు.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh