The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 2
PoorBest 

Hirakani Fort

ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోట నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఉదయం ఆరు గంటలకు తెరవబడే కోట తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారం మూసివేసిన సమయంలో ఒక చీమ కూడా లోపలి నుండి బయటకు గానీ, బయట నుండి లోనికిగాని రాలేదు. అంత కట్టుదిట్టంగా ఉండేది.

శివాజీ రాజ్యంలోని హీరాకానీ అనే పడతి రోజూ కోటలో ఉన్న రాజ పరివారానికి, సైనికులకు ప్రతిరోజు పాలు పోయటానికి వచ్చేది. అలానే ఒక రోజు సాయంత్రం కోట లోకి వచ్చింది. అదే సమయంలో ఓ సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి, అక్కడే సహాయం చేస్తూ ఉండిపోయింది. ఇంటికి వెళదామనుకునే సమయానికి కోట తలుపులు మూసివేయబడ్డాయి.

కావలివాళ్ళు, హీరాకానీ చాలా మంచిదనే అభిమానం ఉన్నా, రాజాజ్ఞ కనుక కోట తలుపులు తీయలేదు. "అయ్యో, ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలి వేస్తుంది, వాడికి పాలివ్వాలి, కోట తలుపులు తీయండి" అని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. హీరాకానీ మీద జాలిపడి, కావలి వాళ్ళు రేపు ఉదయానే నిన్ను మేమే స్వయంగా లేపి పంపిస్తాము, అంతవరకు ఇక్కడే ఉండమని బదులిచ్చారు.

మర్నాడు ఉదయాన్నే కావలివాళ్ళు హీరాకానీ కోసమై వెదకసాగారు. ఎక్కడైనా ఆదమరచి నిద్రపోయిందేమో అని వెదుకుతుండగా, ఆవైవైపు కోట గోడ దగ్గర హీరాకానీ పాల, పెరుగు కుండల ఆనవాళ్ళు కనిపించాయి. ఆశ్చర్యంతో కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.

Chatrapati Sivaji

ఒక స్త్రీ రాత్రివేళ శత్రు దుర్భేద్యమైన కోట ఒంటరిగా దాటి ఎలా వెళ్ళిందా? ఎలా సాధ్యమని శివాజీ స్వయంగా బయలుదేరాడు పరిశీలించటానికి.

ఇంతలోనే, హీరాకానీ తిరిగి రానే వచ్చింది. "అయ్యా, రాత్రంతా పాలకై ఏడ్చే నా బిడ్డడే గుర్తుకు వచ్చాడు, ఇక ఏ దారీ తోచక ప్రయత్నించి ఈ కోట గోడ దాటుకుని వెళ్ళాను, క్షమించండి" అని ప్రార్ధించింది.

శివాజీ కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చూస్తుండగానే, హీరాకానీ మాత్రుప్రేమకు చెమ్మగిల్లిన కళ్ళతో ఆమెకు నమస్కరించి "అమ్మా మాతౄ ప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోట గోడలెంత. ఇక నుంచి ఈ కోట బురుజు హీరాకానీ బురుజుగా పిలవబడుతుంది" అని ప్రకటించాడు. అప్పటి నుండి రాయగఢ్ కోట బురుజు హీరాకానీ బురుజుగా పిలవబడుతున్నది.

Comments   

 
0 #3 RE: హీరాకానీ - మాతృప్రేమ Raghothama Rao 2011-05-07 04:33
సాధారణంగా ప్రతి చారిత్రిక కథకు పాఠాంతరాలుంటాయి . ఇక్కడి రెండు కథలూ బావున్నాయి.
Quote
 
 
+1 #2 RE: హీరాకానీ - మాతృప్రేమ Kuthala Dayalan 2011-05-06 19:29
ఇప్పుడు కూడా లోకల్ tribals వారు మజ్జిగ, పెరుగు అమ్ముతారు అక్కడ. అది కూడా పాత పద్దతిలోనే (మట్టి కుండ, మట్టితో చేసినా కప్పు)
Quote
 
 
+1 #1 RE: హీరాకానీ - మాతృప్రేమ Kuthala Dayalan 2011-05-06 19:25
క్షమించాలి! నేను విన్న కత కంటే భిన్నంగా ఉంది. నేను బొంబాయి లో 6 సం. పనిచేసాను ప్రతి సం. ఈ కోటకు (రత్నగిరి లో ఉంది) వికలాంగులను World Environment Day ట్రాకింగ్ కొరకు తీసుకు వెళ్ళే వాళ్ళం. అప్పుడు నేను లోకల్ వాళ్లకు Noise pollution, Disability topic మీద చిన్న సెమినార్ లాంటి వి నడిపే వాళ్ళం, లోకల్ వాళ్ళు చెప్పినది ఏమిటంటే తను (హీరాకాని) పెరుగు, మజ్జిగ అమ్మేది. అలా ఒకరోజు తను కోటలో ఓ సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి, అక్కడే సహాయం చేస్తూ ఉండిపోయింది. ఇంటికి వెళదామనుకునే సమయానికి కోట తలుపులు మూసివేయబడ్డాయి. తనకు పసి బాలుడి గుర్తుకు వచ్చి తనకు ఆకలి వేస్తె పాలు ఇచ్చే వారు వేరే వాల్లు లేరు అని చెప్పిన సైనికులు గేటు తీయలేదు. అయిన హీరాకాని తన పసి పాప కోసం కోటనుంచి తప్పించుకొని వెళుతున్న సమయంలో సగం దూరంలో కాపాలా ఉన్న సైనికులు తనను భందించి శివాజీ మహారాజు ముందు నిలబెట్టారు. అందరు అనుకొన్న దానికంటే భిన్నంగా శివాజీ మహారాజు గారు తనను మెచ్చుకొని ఇలా అన్నారట. తల్లీ నువ్వు కోటనుంచి తప్పించుకొనే ప్రయత్నం ద్వారా నా కోట యొక్క security లోపాని నాకు తెలియజేస్సావు (శత్రువు నుంచి రక్షించావు)అని బంగారు కాసులతో సత్కరించారట.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh