Articles

User Rating:  / 2
PoorBest 

కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి "నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?" అని అడిగితే, "అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా" అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట.

 

* * * * *

ఓ సారి, తను రాసిన పద్యంలో "ర" కు "ఠ" కు శ్రీశ్రీ యతి వేసారట. అదేమిటని అడిగితే, "నేత్ర యతి" అని శ్రీశ్రీ జవాబు ఇచ్చారట.

 

* * * * *

 

గోపీచంద్ దర్శకత్వం వహించిన "పేరంటాలు" ప్రివ్యూ చూసి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య :

 

చూచితి పేరంటాలిని,

వాచెను, నా రెండు కనులు వలవల యేడ్వన్

లేచీ లేవక మునుపే

గోచి విడెను, ఏమనందు గోపీచందూ!

 

* * * * *

 

1950 నాటి పరిస్థితులు ఉటంకిస్తూ ఆచార్య రంగా "ఆంధ్ర దేశంలో సైనికపాలన అవసరం" అని అంటే, ఆనందవాణి పత్రికలో శ్రీశ్రీ ఇచ్చిన రిటార్టు :

 

ఘో "రంగా"'! క్రూ "రంగా"'! ఛీ "రంగా"!! థూ "రంగా"'!

 

* * * * *

 

"ఒరుగులుగా, పొరుగులుగా, ఊరగాయలుగా! పొడిగా ఉప్పుతో నాన వేయడం ద్వారా రసరూపేణా పండ్లు నిల్వ చేసే విధానాలు కనిపిఎట్టాలి" - ఆచార్య రంగా

 

"ఇంత మధురమైన గేయానికి ఎవరైనా స్వరం అవీ వేసి ఆర్కెస్ట్రాతో పాడిస్తే ఎంత బాగుణ్ణు"! - శ్రీశ్రీ

 

* * * * *

Comments   

 
-2 #2 "కారాలు"- నవ్వుల తీపి kusuma 2011-08-04 05:52
శ్రీశ్రీ చమత్ "కారాలు" -
ఆవకాయ పత్రికలో ఈ కారాలు -
నవ్వుల తీపిని అందించాయి అవధాని గారూ!
మంచి హాస్య స్ఫోరకమైన శ్రీ శ్రీ - పదముల పదనిసలను అందించారు, అవధాని గారూ!
Quote
 
 
-1 #1 "కారాలు"- నవ్వుల తీపి kusuma 2011-08-04 05:50
అవధాని గారూ!మంచి హాస్య స్ఫోరకమైన
శ్రీ శ్రీ - పదముల పదనిసలను అందించారు
అవధాని గారూ!
శ్రీశ్రీ చమత్ "కారాలు" - ఆవకాయ పత్రికలో
ఈ కారాలు - నవ్వుల తీపిని అందించాయి.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh