- Member Categories - ప్రముఖుల హాస్యం
- Written by kadambari piduri
- Thursday, 21 September 2017 14:30
- Hits: 522
కమ్యూనిస్ట్ సిద్ధాంతములను నమ్మిన మహాకవి శ్రీశ్రీ ఇతర సైద్దాంతిక మిత్రులతో కలిసి రష్యా మొదలైన కమ్యూనిస్ట్ దేశాల్లో "సిద్ధాంత యాత్రలు" చేస్తున్న కాలంలో జరిగిన ఓ చమత్కార సన్నివేశాన్ని ఇప్పుడు తెలుసుకొందాం.
శ్రీశ్రీ రష్యా యాత్రకు వెళ్ళినప్పుడు చలికాలం విజృభించేస్తోంది. విపరీతమైన ఆ చలిని తట్టుకోవడానికి గాను వెచ్చటి టోపీలు, ఉలెన్ కోటులు, గ్లోవ్స్ వగైరాలను శ్రీశీ సహా అందరూ వేసుకొనేవారు.
ఎప్పుడూ ప్యాంటు, చొక్కాలో సింపుల్గా కనబడే మహాకవి ఆ ఊలు దుస్తుల ఆహార్యముతో నవీనంగా కనిపించారు. అప్పుడు ఒక మిత్రుడు శ్రీశ్రీని చూస్తూ సరదా కామెంట్ చేశారు - "శ్రీశ్రీ గారూ!మీరు అచ్చంగా ఎస్కిమోలాగా ఉన్నారు!"
వెనువెంటనే "అక్కడేనండీ జనం నన్ను తప్పర్ధం చేసుకుంటున్నారు. నేను ఎస్కిమోను కాను, నిజానికి నేను 'విస్కీమో'నండీ!" అని చమత్కరించారు శ్రీశ్రీ.
@@@@@
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.