The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

అర్జెంటీనాలో  "హస్తినాపురము" ఉన్నది, తెలుసా!?              

(అర్జెంటీనమ్ అనే ధాతువు యొక్క లాటిన్ నేమ్ మూలముగా ఒక దేశమునకు పేరు వచ్చింది, అమితాబ్ బచ్చన్ "కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రోగ్రామ్ లో ఈ క్విజ్ వచ్చింది మరి!) అక్కడ వెలిసిన "హస్తినాపుర్" యొక్క కొత్త అంశముల సమాచారములు అందరినీ ఆకట్టుకుంటున్నవి.

పన్నెండు ఎకరముల విశాలభూమినందున్న పుణ్యక్షేత్రం అది, 'అర్జెంటీనా - హస్తినాపురము'లోని పచ్చని చెట్లు, మొక్కలు, ఫల పుష్పాలు ఉదయగాన ఆరోహణల గమకముల సమున్నత దృశ్యాలను నలు దిక్కులకు తెలుపుతూన్న ముత్యాలసరముల నమ్రకాంతుల వినమ్ర వాహిని.

కనుక మన ఆశ్చర్యార్ధక చిహ్నాలకు ఈ విశేషం మంచి కానుకయే! 

హిందూదేవతల కూడలి, అంతేనా! ఆ చోట గ్రీకు దేవత, క్రైస్తవ దేవి మున్నగువారి ప్రతిమలు ఉన్నవి. హస్తినాపురమున అన్ని మతములకు సమ ఆదరణ ఉన్నది. హస్తినాపురమునందు బుద్ధుని విగ్రహము ఉన్నది. అట్లాగే "కన్య మేరీ" (Virgin Mary) విగ్రహము సైతం అక్కడి పది విగ్రహాలలో కొలువు తీరి ఉన్నది.

అందుచేత అచ్చట సమత, భ్రాతృభావ ప్రవర్తనను ఇనుమడింప జేస్తూ ఆహ్లాదభరితం చేస్తున్నది. భారతీయ అగరుబత్తుల పరిమళాలు అచ్చట ముచ్చటలాడుతూ మనసులను సేదదీరుస్తూ ఉంటాయి. 

*****

శిల్ప సోయగాలు:-  హస్తినాపుర కోవెలల సమూహములు శిల్పి నైపుణ్యాలకి, కళాచాతుర్యానికి నిదర్శనములు. సువిశాల నందనవనమునందు గణేశుడు పక్కన ఉన్న "పరమేశ్వరుడు" విగ్రహము చూపరులకు దార్శనిక సంభావ్యతను కలుగజేస్తుంది.

గణేశ్, శ్రీకృష్ణ, సూర్య, శ్రీ నారాయణ మూర్తి, మహేశ మొదలైన భగవానుల అనుగ్రహనిలయాన శాంతరసము భావనావాహినిగా ప్రవహిస్తుంది.

హస్తినాపురము - మహాభారతమున కురు రాజ్యానికి రాజధాని కదా!

అందుకని ఇక్కడ పాండవుల కోవెల కూడా ఉన్నది. కనువిందు చేస్తూన్న వృక్షసంపద, పక్షుల కిలకిలారావములను ప్రకృతిమాతకు స్వాగత గీతాలను భక్తిపూర్వక నైవేద్యముగా లభిస్తున్నవి. భక్తుల భజన కీర్తనలు ఉల్లాసాన్ని ప్రశాంతశోభావహం చేస్తూన్నవి. నిలబడిన శ్రీ వినాయక ప్రతిమ తెలని రంగు - ప్రపుల్లశోభా విన్నాణతకు నెలవు.

*****

విద్యలతల్లి ఐన సరస్వతీదేవి విగ్రహము సియుడాడ్ డి సబిడురియా (  (City of Wisdom  & ciudad de la sabiduria) అర్జెంటీనాలో ప్రత్యేకతను కలిగినది. మూఢభక్తి ఇక్కడ కనబడదు, విద్యారాధన విశేష ఆదరణ పొందినది. కళలు, విద్యల పట్ల గల శ్రద్ధ - సరస్వతీ దేవి ఆరాధనకు కేంద్రబిందువు ఐనది.  అర్జెంటీనా ప్రజలు, ముఖ్యంగా స్టూడెంట్సు ఈ హస్తినాపురమున ప్రతిష్ఠితమైన సరస్వతీ మాతను సభక్తిపూర్వకంగా దర్శిస్తున్నారు. హస్తినాపురమును "విజ్ఞాన నగరి"/ వివేకధామము - అని పిలుస్తున్నారు.    

విజ్ఞాన అనేషణ మార్గదర్శి హస్తినాపురము, నిర్హేతు గమనం - కేవలం ఏకైక అవధి కాదు, హస్తినాపుర నిర్వాహకులు పరమావధిని కనుగొనుటకు చేయూత ఇస్తారు. తర్కబద్ధత లేని సూత్రాలని మతము యొక్క గమ్యముగా వారు నిర్దేశించ లేదు.

మానసిక కల్లోలాలు ఏర్పడనీయని నిత్య జీవన యానమునకు అవసరమైన సూత్రములను నేర్పుతారు. సత్ప్రవర్తనకు ఆలంబనగా ఉండగలిగిన అంశాలను వీరు అందిస్తారు. మనిషి - తడబాటు పడకుండా - తన నడతను మలుచుకోగలుగుట, వీరి శిక్షణా పద్ధతిని - అగ్రస్థాయిలో నిలిపినది.  ;;;;;

దుడుకుదనము, మొండిపట్టుదలలు ఇత్యాది లొసుగులను కల్మషాలను తొలగించబడే చదువు - ఈ విధానములోని ప్రత్యేకత.

ఒడిదుడుకులు లేని గమనమునకు ఇది ఎంతో ఆసరా. (The City of Wisdom)  డివోషనల్ సాంగ్సు, యోగ ధ్యానాదులు, ఫిలాసఫీ, మెడిటేషన్, పవిత్రభావనలను ప్రేరేపించ గల డ్రామాలను ప్రదర్శించుట వంటి కార్యాల వలన వాతావరణము వింత క్రమబద్ధతతో తేజోభరితముగా ఉంటుంది. ఈ విధానాలు సర్వదా ఆదర్శ, శ్రేయోదాయకములు కదా!

*****

దేవతామూర్తులు వివిధభంగిమలతో నయనానందం గావిస్తూ ఉంటాయి.

గణేశ చతుర్ధి, వైశాఖి (బైశాఖి) మున్నగు పండుగలను జరుపుతారు. అంతే కాదు! ఇక్కడ వర్కుషాపులు, సెమినార్లను, పునశ్చరణ (= పునః+శ) క్లాసులు, సంఘటనలను ఉదహరణల ప్రస్తావనలు హస్తినాపుర కోవెలలకు సమకూర్చిన చక్కని నగిషీలు. రేడియో ఆవిష్కరణ వారి అజెండాకు అదనపు పట్టుకుచ్చులు. 

హస్తినాపుర ఆలయాల మరొక ప్రత్యేకత ఉన్నది.

అదేమిటంటే, దేవుళ్ళకు, వ్యక్తులకూ నడుమ పూజారులు గానీ, దళారీలు గానీ ఉండరు. చిలుకూరు (హైదరాబాద్) గుడిలో మాదిరిగా ఇక్కడ అనుసరణ ఉన్నది, అనగా డబ్బుల కలెక్షను చేయరు.

ఇక్కడ అందరూ అర్చకస్వాములే! మంత్రోచ్ఛారణ, గానాలాపనలను జనులు నేర్చుకుని, పాడుతారు. ప్రజలు చిన్న సమూహములుగా ఏర్పడుతూ, భజనలను చేస్తూంటారు.

*****

బ్యూనోస్ ఎయిర్స్ (Buunos Aires) కి 50 కిలోమీటరుల దూరమున, గంటన్నర ప్రయాణ పరిధిలో ఉన్న ఆధ్యాత్మిక సిటీ, ఈ నగరము - మేలైన ఆరోగ్యవిధానాల మేలిమి మెరుపుగా అమరినది.       

"ఆల్డా ఆల్బర్చ్ట్ ఫౌండేషను" (Alda Albert Foundation) సభ్యులు నెలకొల్పిన సంస్థ హస్తినాపుర్ ఫౌండేషన్. 

*****

మొదట అడిగిన క్వశ్చన్:- యోగవిద్యకై పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉన్న ఊరేది? దాని పేరేది? చెప్పగలరా? 

ప్రస్తుత వక్తవ్యాంశము ఐనట్టి హస్తినాపురమునందు అని మీకు అర్ధమైనది కదా!

3 సంవత్సరముల వ్యవధి ఉన్న కోర్సు. వీక్లీ కొసరోజులలో క్లాసులు చెబుతారు. ఈ సెంటర్లలో 2500 పైన విద్యార్ధులు ఉన్నారు. నూర్గురు గురువులు ఫిలాసఫీని, యోగాను 120మంది లెక్చరర్ లు బోధిస్తారు. అర్జంటీనా ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చి, శిష్యులుగా చేరుతున్నారు.

రోజువారీ బ్రతుకు గమనములోని ఒత్తిడిని జయించ గల విజయవంతమైన విధానములు ఇవి - అని వారు గుర్తించారు, కనుకనే ఇవి సాధన, మార్గాలుగా గైకొనబడినవి.  

పూర్తిగా సహజపరిస్థితులు ప్రజలకు ఇక్కడ లభిస్తున్నవి. ప్రకృతి మనకు ఒనగూడిన వరదాయిని. ప్రకృతి ప్రశాంతిని ప్రజలకు అందివ్వడం లో హస్తినాపుర్ మేనేజ్ మెంటు సంపూర్ణ సఫలీకృతమైనదని నొక్కి వక్కాణించగలము.

*****

'వివేకవర్ధని' ఈ చోటు:-

ఈనాటి ఆధునికత, యంత్రయుగము ఉరుకులపరుగుల జీవనవిధానమునందు ప్రజలు మనుగడ సాగుతున్నది. హస్తినాపుర్ ఫౌండేషన్ సమర్ధవంతమైన నిర్వహణలో నగరం - ధార్మికకార్యక్రమాలకు ఆటపట్టుగా మలచబడినది.

అర్జంటీనియన్లు వేదాంత విద్య, తత్వ గ్రంధముల పట్ల మక్కువ చూపుతారు. లైబ్రరీలో తాత్విక పుస్తకాలను పరిశీలిస్తారు. భజన కార్యక్రమములందు పాల్గొంటారు. యోగాభ్యాసమును, ప్రాణాయామమును అభ్యసిస్తారు. 

హస్తినాపుర ఆశ్రమము నిబద్ధత వలన, భజనలు, గానకళలు, నాటకప్రదర్శనకళలకు ముప్పేట బంగారు హారముగా, ఇక్కడ ప్రోగ్రాములు అమరిక అందరి మన్ననలను అందుకున్నది.  

Hastinapur is an authentic Ashram.

*****

హస్తినాపుర కోవెల ప్రాంగణమునందు ఆహారనియమముగా - శాకాహారమును భుజిస్తారు, వెజిటేరియన్ ఫుడ్డును మాత్రమే అందరూ స్వీకరిస్తారు.

శాకాహారమును చుట్టుపక్కల ఉన్న పేదప్రజలకు, పిల్లలకు, ఇస్తారు.

ఆవులు, జంతువులు, విహంగాది ప్రాణికోటి నిర్భయ సంచారములు చూపరులను ఆకట్టుకుని, కెమేరాలు క్లిక్కుమనేలా చేస్తాయి.

అక్షర సేవ:-

హస్తినాపుర్ ఫౌండేషన్ పుస్తకప్రచురణలు అనుయాయులకు లభిస్తున్నవి. భారతీయ వేదాంతము, భగవద్ గీత, భక్తిసూత్రములు, ఉపనిషత్తులు, శ్రీమద్ భాగవతము, పతంజలి, నారదాది యోగసూత్రములు - అనువాదాలను ఎంతో శ్రమ కోర్చి, అందరికీ అందిస్తున్నారు.

"మహాభారతము" ను స్పానిష్/ స్పెయిన్ లాంగ్వేజి లోకి ట్రాన్స్ లేట్ చేసి, ముద్రణ ఇస్తున్నారు, వీరి దీక్ష గొప్పది కదా! 

"ఆల్డా ఆల్బర్చ్ట్ ఫౌండేషను" (Alda Albert Foundation) సభ్యులు అగణితగ్రంధరచన ఒక బృహత్తర సార్ధక సాఫల్యతకు ప్రతీక. 

(The founder Alda Albrecht- Foundation) స్పానిష్ భాషలో "మహాభారతము" వారి దీక్షాశక్తులకు నిదర్శనము.

500 పుటలకు తగ్గకుండా రచన చేసి, 12 సంపుటి గుచ్ఛములను చేయవలెనని వారి ధ్యేయ ప్రణాళికలు.

Gustavo Canzobre 17 ఏళ్ళ వయసులో హిందూ ఆధ్యాత్మిక చింతనలోని అంతః చేతనను గ్రహించి, పరిశీలన చేయసాగాడు. గుస్టావో షాన్ జోబ్రే - ఆమె (ఆల్డా) వద్ద స్టూడెంట్ ఐ, ఉత్తీర్ణత సాధించి, డైరెక్టర్ ఆఫ్ హస్తినాపుర్ కాలేజ్ ప్రొఫెసర్స్ - పదవిని పొందారు. (Director of the Hastinapur college of professors).

2010 నవంబరులో "Buenos Aires" ఎంబసీ వారు జరిపినట్టి "తృతీయ భారతీయ ఫెస్టివల్" సదస్సులో ఆతని ఉపన్యాసాలు, "దక్షిణభారతావని లోని ఆలయ వాస్తు కళ" గురించి అందించిన మంచి ఇన్ఫర్మేషన్ లు శ్రోతల, జిజ్ఞాసుల ప్రశంసలను పొందినవి.

గుస్తవో కాంజోబ్రే స్పీచ్ లలోని అమూల్య సమాచారములు భవన నిర్మాణాలకు బహు ఉపయుక్తములు.

హస్తినాపుర్ గుళ్ళ సముదాయాలను ఆసాంతము అర్జంటీనియన్లు , వాస్తు, శిల్ప కళతో సహా - నిర్మించినారు, ఇది చెప్పుకోదగిన వార్తలలో ఒకటి.   

అర్జంటీనా జనులు భారతీయ ఆర్కిటెక్చర్, స్కల్చరులను అధ్యయనం చేసి, వృత్తినైపుణ్యతలను సాధించి, హస్తినాపుర్ దేవాలయ నిర్మాణ కార్యకలాపములందు భాగస్వాములు ఔతున్నారు.

'కళాప్రపంచము' - మనస్పర్ధలను, సైద్ధాంతికవిభేదాలను చెరిపివేస్తుంది - అనుటకు మంచి తార్కాణము గా హస్తినాపుర్ నిలుస్తున్నది.  

*****

హస్తినాపుర్ గుడి ఎదుట ఉన్న కొలను- స్వచ్ఛమైన జలములు కలిగి, మీనములతో కళ్ళాడూ, పవిత్రపుష్కరిణిని తలపిస్తున్నది. (నేడు మన దేశ ఆలయ పుష్కరిణులు నాచు, అపరిశుభ్రతలవలన వెలవెలబోతున్నవి, అనేది నిష్ఠురమైన నిజము)

కళాప్రపంచము - విభేదాలను చెరిపివేస్తుంది - అనుటకు మంచి తార్కాణము గా హస్తినాపుర్ నిలుస్తున్నది. విచిత్రమేమిటంటే "హస్తినాపుర కోవెలలు" వ్యవస్థాపకులు ప్రచారపంథాను అనుసరించలేదు. ప్రకటనలు ఇవ్వడము వంటివి చేయరు. ఆ నోటా ఆ నోటా తెలిసి వస్తున్న భక్తులతో ఈ ఆవరణలో సామరస్యవాతావరణ శోభితముగా ఉంటుంది. హస్తినాపుర క్షేత్రమునకు అనేకులు వృత్తినిపుణులు, ఇంజనీర్లు, కంపెనీ మేనేజర్లు, ప్రొఫెసర్లు మున్నగువారు వస్త్తూంటారు. అందరూ స్వచ్ఛందముగా అర్జంటీనా హస్తినాపుర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఎందరో వలంటీర్లు ఆనందముగా కృషి చేస్తున్నారు.

హస్తినాపుర్ గుడి ఎదుట ఉన్న కొలను స్వచ్ఛమైన జలములు కలిగి, మీనములతో కళ్ళాడూ, పవిత్రపుష్కరిణిని తలపిస్తున్నది. (నేడు మన దేశ ఆలయ పుష్కరిణులు నాచు, అపరిశుభ్రతలవలన వెలవెలబోతున్నవి, అనేది నిష్ఠురమైన నిజము)

హస్తినాపుర్ ఫౌండేషన్ - కళాజగతికి అభినందనలు చెబుదాము.

*****

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh