User Rating:  / 1
PoorBest 

శరణు శరధి శయన కరుణరసమయనయన
శరణు దశరథబాల జానకీ లోలా
శరణు వాలిహరణ శరధిబంధన నిపుణ
శరణు వ్రతనియమ నిజసదనగమనా

మహిలోన మనుజునిగా అహిశాయి జనియించ
మహిత జనహితము శ్రుతిగమారే
మహిమ జూపగ శిలయు మహిళహల్యగ మారె
గుహుని నావను గాచె శబరి గేహము బ్రోచె

మరుతసూనుని స్నేహామృత తప్త సుప్తుని
నిరత మునిమన మనన భావదీప్తుని
చరిత వ్రాసిన బోయను చరితాత్ము జేసిన
భరత క్షితి పతి స్మృతికి నశియించు నఘతతి

భావించనీ దేహమా అయోధ్యయెననుచు
భావించ నీ మనసు పీఠికేయనుచూ
భావించినా తండ్రి సేవించనీయడే
భావనారాయణన్న బిరుదున్న వరదుడు!

Comments   

 
+1 #2 మహిళ - అహల్య kadambari piduri 2015-01-15 14:30
"మహిమ జూపగ శిలయు మహిళహల్యగ మారె
గుహుని నావను గాచె శబరి గేహము బ్రోచె..."
1.'మహిళ + అహల్య' - ఈ సంధిని కొంచెం జాగ్రత్తగా వాడవలసివస్తుంది . కనుక "మహిని శిలయు మహిళ అహల్యగాను మారె" అనినచో బాగుంటుందేమో!?"
2. భృగుమహర్షి నూతన జన్మ "గుహుడు", ఈ కోణము లో 'నావ పాట' ఏదైనా వ్రాయగలరా!?
Quote
 
 
+1 #1 మహిళ - అహల్య kadambari piduri 2015-01-15 14:30
"మహిమ జూపగ శిలయు మహిళహల్యగ మారె
గుహుని నావను గాచె శబరి గేహము బ్రోచె..."
1.'మహిళ + అహల్య' - ఈ సంధిని కొంచెం జాగ్రత్తగా వాడవలసివస్తుంది . కనుక "మహిని శిలయు మహిళ అహల్యగాను మారె" అనినచో బాగుంటుందేమో!?"
2. భృగుమహర్షి నూతన జన్మ "గుహుడు", ఈ కోణము లో 'నావ పాట' ఏదైనా వ్రాయగలరా!?
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh