User Rating:  / 0
PoorBest 

పల్లవి:

ఓంకార రూపముతో, విశ్వమున నిండిన,

శంకర నందన, సిద్ధి గణేశ!                 || ఓంకార ||

     

అనుపల్లవి:

పాకరి వినుత, పరమ దయాళ,              

సాకార రూపా! సుముఖ గణేశ!           ||ఓంకార ||

 

1.భవాని పుత్ర, బహుదివ్య వదన,

నవ దివ్య విద్యోత,  నటన గణేశ!

కవి జన స్తోత్ర, కరుణా భావ,

కోవిద కీర్తిత,  కనక గణేశ!                       ||ఓంకార || 

  

2.విజయ, విద్యా దాత, విఙ్ఞాన దీప్త,

నిజ భక్త మందార, నిఖిల గణేశ!

ఉజ్వల తేజ,  ఉత్తమ పురుషా!

అజత్రయ రక్షిత,  అతుల గణేశ!                 ||ఓంకార || 

 

3.శ్రీవాణి, శర్వాణి కారుణ్య దాయక,

అవిరళానంద, అనఘ గణేశ!                   

అవ్యక్త , అమర నుత, ఆశ్రిత వరద,       

సవినయ వందనము గొమ్ము గణేశ!                    ||ఓంకార || 



పాకారి = ఇంద్రుడు

సుముఖ = విద్వాంసుడు

(అజత్రయ = బ్రహ్మవిష్ణుమహేశ)

అనఘ = మనోఙ్ఞమైన

అవ్యక్త = పరమాత్మ

Comments   

 
+1 #1 శంకర నందన, సిద్ధి గణేశ! kadambari piduri 2014-08-29 14:12
రమాకాంతరావుగారూ ! వినాయకచవితి శుభాకాంక్షలు; మీ గీతం బాగున్నది, ముఖ్యంగా అధోసూచిక- పాకారి మొదలైన పదాలకు అర్ధాలను ఇచ్చారు, పాఠకులకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరం -
కుసుమ/ కాదంబరి/
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh