User Rating:  / 0
PoorBest 

రాలిన పూలను జూచి జాలిని చూపగ జాలక
కూలిన మానవుల జూచి చలించగలవే? మరి చలించగలవే?

మదిలో సద్ధర్మమ్ముల వదలక సత్కర్మమ్ముల
సదమల సద్భాషణముల సద్దే లేకున్న
ఇద్ధరలో నాకము కోరిన - భువిపై శాంతిని లేదన్న
సాధ్యమా! సంతతముగ సాధన మరచిన ఓ జీవి?

పరహితమన్నది ఎరుగక - పరగతి పథమును అరయక
పరిపరి దుష్కర్మమ్ముల వెరవకనే జేసి
నర నట విటులనె దేవరలని తలచీ గొలిచీ
హరికథ సుధలను బోనాడిన ఓ జీవీ

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh