The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

 

మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము.

 • శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
 • ఒక గన్నేరు పూవువెయ్యి జిల్లేడు పూలతోమానం.ఒక మారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానంఒక.
 • ఒకతామరపూవువెయ్యిమారేడుదళాలసమానం.ఒకపొగడపూవువెయ్యితామరపూవులతోసమానం.
 • ఒకములకపువువెయ్యిపొగడపూవులతోసమానంఒకతుమ్మిపూవువెయ్యిములకపువులతోసమానం.
 • ఒకఉత్తరేణిపూవువెయ్యితుమ్మిపూలతో సమానం.ఒక  ఉత్తరేణి పూవు వెయ్యి పొగడపూవులతో సమానం.
 • ఒక దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతో సమానం.ఒకజమ్మిపూవువెయ్యిదర్భపూులతో సమానం.
 • ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతో సమానం.వెయ్యి నల్లకలువ పూవులతోచేసిన మాలను శివునికి సమర్పిస్తారో వారుకైలాసంలో నివసిస్తారు.
 • మొగిలి -మాధవిమల్లి {మల్లె కాదు }అడవిమల్లి -సన్నజాజి - ఉమ్మెంత -దిరిసెన-సాల-మంకెనపూవులనుశివ పూజలో వాడరాదు.మిగిలిన పూవులను శివ పూజలో వాడవచ్చు.
 • విష్ణు పూజకు సన్నజాజి, మల్లె, అడవిమొల్ల, పులగురివిందా, కలిగొట్టు, గన్నేరు, దేవకంచన, తులసి, గులాబీ, పసుపు, గోరంట, సంపెంగ, దింతెన, అశోక, మొగిలి, నాగ కేసర, జమ్మి పుష్పములు శ్రేష్ట్రమయినవి.
 • ఒక తుమ్మి పూవుతో పూజించిన పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
 • వెయ్యి తుమ్మి పూల కంటే ఒక చండ్రపూవు వెయ్యి చండ్రపూవుల కంటే ఒక జమ్మి పూవు, వెయ్యి జమ్మి పూవుల కంటే ఒక మారేడు దళం, వెయ్యి మారేడు దళాల కంటే ఒక అవిసె పూవు, వెయ్యి అవిసె పూవులకంటే ఒక నందివర్ధనం, వెయ్యి నంది వర్ధనాల కంటే ఒక గన్నేరు పూవు, వెయ్యి గన్నేరుల కంటే ఒక సంపెంగ, వెయ్యి సంపెంగలకంటే ఒక అశోక పుష్పము, వెయ్యి అశోక పుష్పముల కంటే ఒక తెల్లగులాబి, వెయ్యి తెల్లగులాబిల కంటే  ఒక పచ్చ గోరింట, వెయ్యి పచ్చగోరింటలకంటే ఒక తెల్లని సన్నజాజి ఇలా మూడుదొంతరల మందారము, కుందము,పద్మము, తామర, మల్లె, జాజి పూవులు విష్ణు పూజకు శ్రేష్ట మైనవి.
 • వెయ్యి జాజి పూవులతో మాల గుచ్చి విష్ణువుకు అలంకరించినవాడు విష్ణువు  దగ్గరే నివసించును. అన్ని పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసిదళముతో పూజించిన వచ్చును.
 • మందారము, జిల్లేడు, ఉమ్మెత్త ,బూరుగ, దేవకాంచన మొదలగు పూవులు విష్ణు పూజకు పనికిరావు. 

శివ పూజ, విష్ణు పూజకు వాడవలసిన పూల గురించి  ఇంతకముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవి పూజకు  కావలసిన పూవుల  గురించి  చెప్పుకుందాం.

పూలమాలలు కట్టుట 64 కళలలో ఒకటి.  వివిధ వర్ణములు వివిధ జాతులకు చెందిన పుష్పములతో కలగలిపి కట్టిన మాలలు మూడు రకములు:

 1. హృదయము వరకే ఉండే పొట్టి మాలలను రైక్షికములు అంటారు ఈ మాలలు ఆనందమును కలిగిస్తాయి.
 2. నాభి (బొడ్డు) క్రిందకు ఉండే మాలలు సాధారణియములు. ఈ మాలలు ఆనందమును రెట్టింపు చేస్తాయి.
 3. పాదపద్మములపై పడే వానిని వనమాల అంటారు. ఇది అన్ని మాలల కన్నా ఉత్తమమైనది.

మాలలు - యాగ/పుణ్య ఫలాలు

 • గన్నేరు,పొగడ,దమనం,నల్లకలువ,తామర,సంపెంగ,జాజి మొదలగు పూలతో కట్టిన మాలలు రైక్షికములైనా అమ్మకు చాలా ఇష్టం. మారేడు దళములతో అల్లిన రెండు దండలను అమ్మకు అర్పించిన రాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
 • సుగంధ పుష్పములను విడిగా కాని, మాలలు కట్టికాని అమ్మవారిని  పూజించిన అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది.
 • పొగడ పూలతో మాల కట్టి అమ్మవారికి సమర్పించిన వాజిపేయ యాగం చేసిన ఫలితం దక్కుతుంది.
 • తుమ్మి పూల దండతో  అమ్మను పూజించిన కానిరాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
 • జమ్మి పూల దండతో అర్చన చేసిన వెయ్యి గోవులను దానమిచ్చిన ఫలితం దక్కుతుంది.
 • రెళ్ళు పూల దండతో అర్చన చేసిన పితృ లోకాలు కలుగుతాయి.
 • ల్ల కలువ పూల దండతో అర్చన చేసిన దుర్గాదేవికి ప్రియ భక్తుడై రుద్రలోకంలో  నివసిస్తాడు.
 • మారేడు దళ దండతో పూజించిన లక్ష గోవులను  దాన మిచ్చిన ఫలితం దక్కుతుంది.
 • అమ్మవారికి అన్ని పూవుల కంటే మారేడు దళములంటే  అత్యంత ప్రీతి. రాత్రి పూట కడిమి పూలతోను ఇరు సంధ్యల యందు మల్లికలతోను మిగిలిన సమయమందు మిగిలిన అన్ని పువులతోను అమ్మను పూజించవచ్చు.మహాలక్ష్మి అమ్మవారినిఅన్ని పూలతో పూజింపవచ్చు. కాని తులసి, గిరింత, దేవ కాంచన, గరికతో పూజింపరాదు.
 • దుర్గాదేవిని అన్ని పూలతో పాటు జిల్లేడు మందారములతో పూజింపవచ్చు.
 • దుర్గ, లక్ష్మిలకు తప్ప ఇతర దేవతలెవ్వరికీ జిల్లేడు, మందారములతో పూజింపరాదు
 • దుర్గాదేవిని మల్లె,జాజి,అన్ని రకముల తామరలు, గోరింట, సంపెంగ, పొగడ, మందారం, గన్నేరు, జిల్లేడు, దవనం, మరువం, లేత గారిక, దర్భ పూలు, రెళ్ళు పూలు, మారేడు దళములు, అన్ని విధాల పూవులతోను, ఆకులతోనూ పూజింప వచ్చును.
 • పూలు దొరకని రోజులలో ఆకులతో పూజింప వచ్చును.
 • నేలపై, నీటిలో పుట్టిన సుగంధ పుష్పాలను అమ్మ ప్రీతితో స్వీకరిస్తుంది. కాని ఆ పూలను భక్తితో సమర్పించాలి.

పైన చెప్పబడిన పూలతో అమ్మను భక్తీ శ్రద్దలతో పూజించిన అమ్మ మన సమస్త కోరికలు తీర్చును. సంపెంగ, మల్లె, జాజి, తామర, కలువ, మరువం, దవనం మొదలగు పూలతో పూజించిన పుణ్యం నూరు రెట్లు అధిక మగును.

అమ్మవారికి మొగ్గలు, పక్వం కాని పండ్లు, అకాల పక్వ పండ్లు, పురుగు తొలచిన పూలు, పండ్లు నివేదించరాదు. తెలియక అత్యంత భక్తితో  నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించినా భక్రి ఒక్కటే అమ్మ స్వికరించును. తెలిసి కావాలనే, అశ్రద్దతో నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించిన అమ్మ ఆగ్రహించును.

జాజి పూలతో భుక్తి, మల్లెతో లాభము, నల్ల కలువతో బలము, పద్మము శాంతిని ,ఆయుర్వృద్దిని, కమలము సుపుత్రులను, వరి వెన్ను సౌభాగ్యమును, సన్నజాజి వాక్శుద్ధిని, నాగ కేసరము రాజసము, సంపెంగ బంగారమును, మొల్ల కీర్తిని, కలువ కవిత్వాన్ని, మరువము విజయప్రాప్తిని, గరిక ధనధాన్యసంపదను, మోదుగ పూలు పశు సంపదను వృద్ధి చేయును. తెల్లని పూలు సామాన్య కోరికలు తీర్చును. 

అమ్మవారిని ఒక నెల జపా పుష్పములచే పూజించిన అమ్మవారి అనుగ్రహము కలుగును.తెల్లని పూలతో ఒక నెల పూజించిన ముప్పది జన్మల పాపం నశించును. మంకెన పూలతో ఒక నెల పూజించిన సర్వ పాపములు తొలగి పోవును తామర పూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసన్నబుద్ధితో పూజించిన అన్ని పాపములు నశించి మంత్రి పదవి పొందుదురు. మల్లె, జాజి, తెల్ల కలువ, తామరలతో ఒక నెల పూజించిన వంద జన్మల పాపం తొలగును. బ్రహ్మ హత్యా పాతకం తొలగును. వాక్శుద్ధి కలుగును.

పూజించు పూల యందు వెంట్రుకలు  ఉన్న మానసిక వ్యాధులు కలుగును. పురుగులు కలగిన పూలు ఉపయోగించిన రాజ దండనము, మహా భయము కలుగును. అందుకని అమ్మవారికి ప్రియమైన పూలను ఉపయోగించి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుదాం.

శుభమస్తు.      

 

రచన :- పి .పద్మావతి శర్మ, ఎం .ఎ . తెలుగు పండిట్ 

రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు

                                                                                                                                                                                                                                                                                                                                             

 

Comments   

 
0 #3 పుజా పుష్పాలు - వాటి వివరాలు Raghothama Rao 2013-07-28 16:32
Quoting IVNS :
గోపీనాధ శర్మ గారు,
చాల తెలియని విషయాలు తెలిపారు ధన్యవాదాలు. ఎందుకో ఈ వ్యాసం మీరు వ్రాసినట్లు గా లేదు. ఇంకా వివరం గా ఆలోచనాత్మకంగా సాగే మీ రచన ఈ వ్యాసం లో కానరాదు.


ఈ వ్యాసం వ్రాసింది శ్రీమతి పొట్లూరి పద్మావతి గారు సార్:)
Quote
 
 
0 #2 పుజా పుష్పాలు - వాటి వివరాలు IVNS 2013-07-28 16:01
గోపీనాధ శర్మ గారు,
చాల తెలియని విషయాలు తెలిపారు ధన్యవాదాలు. ఎందుకో ఈ వ్యాసం మీరు వ్రాసినట్లు గా లేదు. ఇంకా వివరం గా ఆలోచనాత్మకంగా సాగే మీ రచన ఈ వ్యాసం లో కానరాదు.
Quote
 
 
+1 #1 పుజా పుష్పాలు - వాటి వివరాలు గోపీనాథ శర్మ 2013-07-26 06:47
విజ్ఞానదాయకమైన వివరాలను తెలిపినందులకు ధన్యవాదములు.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh