The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

చాలు, గర్వము యేల హరిని తలుచుము వేగ

నేలాఇ క్షణముల గణన నిలిచేలోగ

 

మత్సావతారుడే మత్సరమ్మును మాపు  కూర్మరూపుడు కర్మతతుల బాపు

వత్సా! వరాహుడు దురాశలను బాపు నారసింహుడు దురితదూరు జేయు

 

వామన రూపుడు కామతృష్ణల జంపు – పరశురాముడు పరుషదనము జంపు

రామభద్రుడు నియమ భ్రష్టతల బాపు – కృష్ణమూర్తియు జ్ఞానతృష్ణ దీర్చు

 

బుద్ధావతారుడు బుద్ధిహీనత బాపు – కల్కి సంచిత శుల్క ఋణము బాపు

శుద్ధాంతఃకరణ బద్ధానుకంపమున స్మరణ జేసిన మరణ భయము బాపు

@@@@@

Comments   

 
+1 #8 చాలు గర్వము sarma 2015-02-09 03:52
బాగా చెప్పేరు కాదంబరి గారూ. భావం ముఖ్యంగానీ భాషతో పనేముందిలెండి, భాషే అక్కరలేదు అనుకుంటే ఇక వ్యాకరణం అస్సలు అక్కరలేదు. ఏదో భగవంతునిపై కవితకదా దొసగులులేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేనుగానీ మీరన్నట్టు భావప్రాధాన్యం గుర్తించలేదు. పార్వతిపురం అని ఎవరైనా అంటే కాదు పార్వతీపురం అనాలి అని చెప్పేనేగానీ మార్జాలవైరివాహన మాతాపురం అని అనమనలేదుగా అంచేత జెండాకొచ్చిన ప్రమాదంలేదులెండ ి. నేను చేసిన సూచన చిరుగాలిలాంటిదే ,తుఫాను కాదు. ఐనా భావం పటిష్టంగా ఉంటే ఎన్ని తుఫానులొచ్చినా ఏం బెంగలెండి
Quote
 
 
0 #7 ధ్వజపటలం kadambari piduri 2015-02-08 16:04
జెండా (పతాకం/ ధ్వజం) రెపరెపలాడుతూ గౌరవాన్ని పొందుతుంది. అదే జెండా - తుఫాను గాలికి పీలికలై పోతుంది.
భాష, అభివృద్ధి, ప్రభంజనమై, భావాన్ని ఛిద్రం చేయకూడదు శర్మ గారూ!
గోపీనాధశర్మగారి కవిత, భక్తిరసప్లావితం , అభినందనం
Quote
 
 
+1 #6 చాలు గర్వము IVNS 2015-02-03 06:17
గోపినాథ శర్మ గారి భక్తి కవితకు మరొక శర్మ గారి కవితా విశ్లేషణ జోడై చాల రక్తిని కట్టించింది. తెలుగు మరచిపోతున్న తెలుగు జాతికి ఈ ఇద్దరు శర్మలు ఒక మేలుకొలుపు అందించారు అని చెప్పక తప్పదు. గోపీనాథ శర్మ గారి వ్యాఖ్యలకై ఎదురుచూస్తూ....
Quote
 
 
+1 #5 చాలు గర్వము sarma 2015-02-03 05:16
ఈ ఒక్కటీ ఎందుకు వదిలిపెట్టడం,

భ్రష్టత అనేమాటా తెలుగులో లేదు కనుక దానికి బహువచన రూపం కూడా లేదు, భ్రష్టు, లేక భ్రష్టుడు అనేవి ఉన్నాయి
అదీ ఆఖరి భోగట్టా
Quote
 
 
+1 #4 చాలు గర్వము sarma 2015-02-02 10:53
I must be excused for these frequent comments.

Fish, Deer, Scenery, Furniture, information. These are few words in engilish for which plural is the same without "s" similarly తృష్ణ కి తృష్ణలు బహువచనం కానేరదు. అది తప్పు కనుక కామతృష్ణలజంపు అని కాక కామతృష్ణనుజంపు అంటే దోషరహితంగా ఉంటుంది కదా, ఏమంటారు శర్మగారూ..
Quote
 
 
+1 #3 చాలు గర్వము sarma 2015-02-02 10:10
మత్స్య అని యకారంతో కూడి ఉంటేనే అది చేప, మత్సావతారము అనకూడదు. దీనిని టైపో అనుకోమన్నారా? ఐతే ఓకే
Quote
 
 
+2 #2 చాలు గర్వము sarma 2015-02-02 06:12
మరోచిన్నమాట
తతి అనేమాటకు తెలుగులో సమయము అనీ సంస్కృతాన సమూహమనీ అర్ధాలున్నాయి. మీ కవితలో రెండు అర్దాలకూ అన్వయం కుదురుతోంది.మీర ు ఏ అర్ధాన్నీ గ్రిహించి వ్రాసేరో తెలియదు మరి. కనుక అన్వయ క్లేశం కూడా జరిగినట్టు అనిపిస్తోంది. సమూహమే మీ ఉద్దేశ్యం ఐతే మీ సమాసం సాధువే, కాకుంటేనే ఇబ్బందంతానూ
అదీ భోగట్టా
Quote
 
 
+2 #1 చాలు గర్వము sarma 2015-02-02 05:48
గోపీనాధ శర్మ గారూ
కవిత్వం బాగుంది. చిన్నమాట,
సమాసం తయారు చేసేటప్పుడు రెండు తెలుగు పదాలతోగానీ, రెండు సంస్క్తత పదాలతోగానీ, లేదా తెలుగూ సంస్కృత పదాలతోగానీ చెయ్యవచ్చును. తొలుత సంస్కృత పదం ఉండి పిదప తెలుగు పదంతో సమాసం చెయ్యడం శాస్త్ర విరుద్ధం. దానిని వైరి సమాసం లేక దుష్ట సమాసం అంటారు. ఆ ప్రకారంగా చూస్తే కర్మతతులు అనే సమాసం సవరించాలేమో చూడండి.

అలాగే పరుషదనము అనే ప్రయోగం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. అది పౌరుషము, లేదా పరుషము మాత్రమే కనుక మరోవిధంగా ఉంటే బాగుణ్ణు. ఆలోచించండి.

మరొక్కమాట. మొత్తం అంతా చదివిన తరువాత మళ్ళీ ఒకసారి తొలి రెండు లైనులూ చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరణ భయము బాపువాడు ఎవడు అనేది ఆ లైనులో లేదు కనుక.
అదీ భోగట్టా
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh