The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

You know! నేను అమలాపురంలో పుట్టేను. ఏడోక్లాసు వరకూ అక్కడే చదివేను. But I was always different and a cut above the rest. మా స్కూల్ లో నాకొక్కడికే ఇంగ్లీషులో మంచి మార్కులొచ్చేవి. చిన్నప్పుడి నుంచే నాకు ఇంగ్లీషు సినిమాలే నచ్చేవి. తెలుగు సినిమాలని చూసే వాడిని కాదు . మెల్లిగా అది ఇంగ్లిష్ పాటలు, బుక్స్..అలా అలా…I could not gel with the guys there. దానికి తోడు మా ఫామిలీ కొంచం పాత రకం.I am the world, you know!

But thankfully, my father moved to Hyderabad soon after and I went to HPS. ఇప్పటికి హైదరాబాద్ వచ్చి పదమూడు ఏళ్లయింది. కొంతలో కొంత బెటర్. లేకపోతే ఎప్పటికీ ఓ కంట్రీ ఫెలోలా మిగిలిపోయేవాణ్ని. I couldn’t bear those village guys when I was there!! సిటీలో కొంత కల్చర్ ఉంది. Different languages, different traditions… నాకలాగే ఇష్టం. ఎప్పుడూ తెలుగూ తెలుగూ ..అంటే its సో foolish. We are in a global village man. Grow up!! Jesus!!

మా అమ్మ నాన్నా ..These oldies are still funny. I like them. They are nice.... కాదని కాదు. కానీ, Early morning, వేరే ఇంకేం పని లేనట్టు, ఘంటసాల భగవత్గీత పెడతారు. It is so boring !! I know I have to die someday man… రోజూ ఎవరో ఒకరు చెప్పాలా? అదీ ఏమవుతుందంటే, నేను రాత్రి 12 o’clockకి కానీ ఇంటికి రాను. వచ్చిన తర్వాత VH1 చూసి పడుకోనేసర్కి రెండవుతుంది. సరిగ్గా నిద్ర పడుతుందో లేదో ఘంటసాల రెడీ. It is so stupid yaar.. కానీ ఏంచెయ్యను. వేరే చోట ఒక్కడినీ ఉండడానికి ఇంట్లో ఒప్పుకోవటంలేదు.

మా ఇంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ హైదరాబాద్ నిండా మాకు చుట్టాలే. ఎవరో ఒకరు ఇంటికి వస్తుంటారు. I can’t stand those guys. సింప్లీ, మర్యాదకి వాళ్ళ మధ్య కూచుంటాను. అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలేవీ నేను భరించలేను. మా చిన్నాన్న ఒకడున్నాడు. I think his wife does not listen to him. ఎవడు దొరుకుతాడా.. అన్నట్టు మాట్లాడుతుంటాడు. You know the topics? Telugu literature, కృష్ణ శాస్త్రి.. శ్రీ శ్రీ .. పాత సినిమాలు, ANR, NTR etc etc..  Get a life yaar !!

ఆ మధ్యనొకరోజు మా చుట్టాల ఇంట్లో పెళ్లయింది. అక్కడ ఒక రోజంతా దొరికి పోయేను. You know what?  Out of all things.... పాత తెలుగు పాటల అంత్యాక్షరీ!! My God.. These guys are from a different planet!!  ఇక ఒక్కక్కో రోజు పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. వేదాలు..పురాణాలు అంటూ ఎక్కడికో వెళ్లి పోతారు. ఎవరికి కావాలి ఇవన్నీ? మనకైమైనా వీటి వల్ల కడుపు నిండుతుందా? కనీసం గ్రీక్ మైథాలజీ తెలుసుకుంటే పార్టీలో నలుగురినీ ఇంప్రెస్స్ చెయ్యొచ్చు. మా గ్రూపులో నేను వేదాలు,పురాణాలు అంటే అంతే నా పని. నా మొహం కూడా ఎవరూ చూడరు.

మా మావయ్య కూడా ఈ ఊర్లోనే ఉంటాడు. ఓ రోజు నే జిమ్ కెళుతుంటే దారిలో కనబడ్డాడు. ఏదో పెద్ద తెలిసిన వాడిలా జిమ్ కెందుకురా.. హాయిగా ఇంట్లో యోగా చేసుకోక అంటాడు. ఒక రోజు ఆయన యోగా చేస్తుంటే చూసేను. వాట్ సార్ట్ ఆఫ్ ఎక్సరసైజ్ ఈజ్ దట్ ? That guy is moving his body once in 10 minutes!! యూ హావ్ టూ పంప్ ద బ్లడ్ ఆన్ ద ట్రెడ్ మిల్ మాన్ !! అదే అసలైన ఎక్సరసైజ్. అఫ్ కోర్స్, ఆయన్ని నేను పెద్దగా పట్టించుకోను. నేను చాప వేసుకొని యోగా చెయ్యడం మొదలెడితే అంతే సంగతి. నా ఫ్రెండ్స్ అందరూ నన్నో మూల చాప మీద కూచోపెట్టేస్తారు. జిమ్ కెళ్ళడం అన్నది ఓ పెద్ద స్టేటస్ సింబల్. ఓ పెద్ద టాకింగ్ పాయింట్. ఆ విషయం ఆయనికి అర్థం అవుతుందనుకుంటే అది నా foolishness.

ఈ మావయ్యకో కొడుకున్నాడు. ఇక్కడ కాదు. సియాటల్ లో. That fellow is dating a Brazilian bombshell there. ఈ మధ్యనే Whats’app లో ఫోటో పంపించేడు. చూసేను. లక్కి బాస్టర్డ్. ఐ యాం జెలాస్. నాకూ అక్కడేమైనా చూడమని చెప్పేను. Babes కాదు. ఉద్యోగం. ఈ బ్రెజిల్ గుంట సంగతి మా మావయ్యకింకా తెలీదు. అమాయకంగా నా కజిన్ కోసం కోసం గోత్రాలూ, జాతకాలూ అంటూ అందరి ఇళ్ళూ తిరుగుతున్నాడు. తెలిస్తే ఓ మినీ హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకోడానికి ఇంకెంత యోగా చేస్తాడో ? హ హ హ ...

ఈ మధ్య అందరూ కలిసినప్పుడల్లా ఇంకో గోల. తెలంగాణా, ఆంధ్రా అంటూ.. Who cares man!!  ఎవరు పవర్లో కొచ్చినా మనకేం చెయ్యరు. ఇంకీ టైం వేస్ట్ ఎందుకు? మన కంట్రీ పొలిటిషియన్స్ ఏమైనా U.S లాగానా.. These guys are actually country brutes. నేనసలు U.Sలో ఏమైనా opportunities వస్తాయేమో అని చూస్తున్నా. నా కజిన్ లాగ ఇక్కడ నుండీ వెంటనే పారిపోకపోతే మా నాన్న ఏ మండపేట నుంచో ఓ మహాలక్ష్మిని తెచ్చి నాకు కట్టపెట్టేస్తాడు. అల్లాంటి ప్రమాదమేదో రాకముందే నా దారి నేను చూసుకోవాలి. Once I get out of this place, ఐ కెన్ actually రెస్ట్ ఇన్ పీస్.

@ @ @ @ @

Comments   

 
0 #2 వీడూ మనలో ఒకడే ! Vijay 2014-03-11 12:46
Thanks to globaliastion the malaise of aping the west will only intensify till a crescendo is reached, after that things will start to change. Wittily written and great insight.
Quote
 
 
+1 #1 వీడూ మనలో ఒకడే ! IVNS 2014-03-10 09:17
//Once I get out of this place, ఐ కెన్ actually రెస్ట్ ఇన్ పీస్.//
If this is true the entire Nation must vacate India and migrate to US. Fun and pun apart, the story is mirror of the psyche of some of our new generation adults. Film starts like Allu Arjun speaks in Telugu and uses "and" in between to connect to another sentence/view.. ... good one Vishnu garu.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh