The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 0
PoorBest 
అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఎన్నో ఏళ్ల మోసపూరిత ఆరోగ్య బీమా వ్యవస్థకు ఒక చిన్న కుదుపు ఇచ్చింది. ఈ ఆరోగ్య బీమా వ్యవస్థ ఇక్కడ మన దేశం లో వేళ్ళూనుకొంటున్న తరుణంలో ఈ పరిశీలన అవసరమని భావించి చేసిన చిన్న ప్రయత్నం.
 
1. 26  ఏళ్ళు వచ్చే వరకూ అమెరికా యువత ఇకపై వారి తల్లిదండ్రుల ఆరోగ్య బీమా నీడలో ఉండవచ్చు. ఇది అమెరికా ఎంచుకున్న కుటుంబ వ్యవస్థకు ఒక పాఠం.  వ్యక్తి స్వేచ్చ అనే పేరుతొ కుటుంబ విలువలు కాలరాసే విధంగా సభ్య సమాజం ఉండకూడదని చెప్పక చెబుతుంది. 18 ఏళ్లకే జీవితంలో ఒక మధ్యవయస్కుడితో సమానంగా అనుభవాన్ని సంపాదించే యువతకు 26  ఏళ్ల వరకూ తమ ఆరోగ్యాన్ని తాము చూసుకొనే విషయంలో అనుభవం ఉండదనా దీని సారాంశం?
 
2. ఒక వ్యక్తీ తన జీవిత కాలంలో ఎంత బీమాను పొందవచ్చు అనే విషయంపై బీమా కంపనీ తన విచక్షతను ఇకపై వినియోగించదు. బీమా సౌకర్యం పొందిన ప్రతి వ్యక్తీ రోగిష్టిగా మారి, వైద్యాలను పొందుతూ కాలం చేస్తాడు అనే భావన లేక దొంగ క్లైములు పెట్టి దండిగా డబ్బు సంపాదించే అవకాశం కల్పించడానికా? ఇది మంచికా చెడుకా? లేదా పారదర్శకమైన వైద్య విధానం అమెరికాలో ఉన్నది కనుక ఈ వెసులుబాటు కల్పించవచ్చా? మనదేశం లోని పాలకులు ఇతర దేశాలను ఎక్కువగా అనుగమిస్తారు కనుక ఇది ఇక్కడా ప్రవేశ పెడితే భ్రష్టాచారానికి తలుపులు తెరచినట్లే!!
 
3. ఒక వ్యక్రి రోగగ్రస్తుడైతే, అతని బీమాను రద్దు చేయడమనే పద్ధతికి బీమా సంస్థలు స్వస్తి పలకాలి అంటే ఇంత అమానుషంగా ఉంటాయా బీమా సంస్థలు అమెరికాలో !!
 
మన భారత దేశంలో ఆరోగ్య బీమా వ్యవస్థ గత 10 సం. లు గా బాగా వేళ్ళూనుకొంటోంది.  ఒక రోగి cashless transaction approval పొంది ఉంటే మన వైద్యశాలలు ఎంతగా దండుకుంటాయో మనందరికీ అనుభవమే.  ఇలాటి తరుణంలో అమెరికాలో జరుగుతున్న ఈ మార్పులు మన బీమా సంస్థలు, వైద్యశాలలు గమనించకపోవు. కాని మనం ఎన్నుకున్న మన పాలకులు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా స్పందించరనే విషయం మనకు విదితమే. 
 
కాని కాలం బహు బలమైనది ఎక్కడో జరిగిన మార్పులు ఒకప్పుడు చాల ఆలస్యంగా ప్రపంచంలో ఇతర ప్రాతాలకు తెలిసేవి.  కాని ఇప్పుడు Thanks to Information Technology తత్క్షణమే ప్రపంచమంతా తెలిసిపోతున్నాయి. 
 
ఈ క్రింది తెలిపిన నిర్ణయాలు మన భారత బీమా సంస్థలు కూడా అవలంబిస్తే మన ఆరోగ్య బీమా వ్యవస్థ చాల వరకు బాగు పడుతుంది. ఇది మన పాలకులు గమనించి మన ఆరోగ్య బీమా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిడిద్దగలిగితే  అమెరికా కంటే మెరుగైన మానవతా విలువలు ఉన్న వ్యవస్థను మనం నెలకొల్పగలం అని ప్రపంచానికి ఋజువు చేయగలం.Comments   

 
0 #5 web Developer venu 2013-03-03 17:13
అమిరికా ప్రజల యొక్క అవసరాలను పరిగణలోకి తీసుకోని అప్పటికి అప్పుడు మంచి కోసం చట్టాలను తెస్తుంది అందుకే ఇటివల [url="http://ww w.immigrationqu estion.com/star tup-act-3-0"]Im migration Startup act కూడా చేసినది. మన దేశంలో కూడా భేమ చట్టాలను నియంత్రించటానిక ి ప్రత్యేకంగా ఏమి చట్టం చేయలేదు ఫలితంగా కార్పోరేట్ హాస్పిటల్ మరియు పేషెంట్ కలిసి అటు భీమ సంస్థలను అలాగే భేమ సంస్థలు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయి అలాంటివి అక్కడ జరుగుతున్నవి కాబట్టే అక్కడి ప్రభుత్వం ఆ చెర్యలు చేపట్టినది. . . ఇక్కడ అలంటి చట్టాలు బ్రిటిష్ కాలం లో ఉన్నవే అమలుచేస్తున్నార ు అందుకే మనం ఇలా ఉన్నాము ...
Quote
 
 
0 #4 RE: అమెరికా పౌర ఆరోగ్య వ్యవస్థలో మార్పులు - ఒక తులనాత్మక పరిశీలన IVNS 2012-07-10 13:33
లక్కరాజు గారు చేసిన వ్యాఖ్యను సహృదయంతో ఆహ్వానిస్తాను ఎందుకంటే నాణానికి రెండో వైపు ఒకే సారి చేస్తే ఎప్పుడూ కనబడదు.
అమెరికా పౌర ఆరోగ్య వ్యవస్థ లోని మంచి తీసుకొని మన ఆరోగ్య బీమా వ్యవస్థను చక్కదిద్దుకోవాల నే తలంపుతో వ్రాసిన వ్యాసం ఇది అని గ్రహించగలరు.
అలాగే కుసుమ గారు epass వారు వ్రాసిన వ్యాఖ్యకు ధన్యవాదాలు.
Quote
 
 
0 #3 RE: అమెరికా పౌర ఆరోగ్య వ్యవస్థలో మార్పులు - ఒక తులనాత్మక పరిశీలన epass 2012-07-09 00:17
This information is valuable.
Quote
 
 
0 #2 లక్కరాజు రావు గారి answer kusuma 2012-07-07 16:08
లక్కరాజు రావు గారి జవాబు చదివాము.
ఇలాటి వ్యాసాలు సమాజములో కాస్తో కూస్తో చలనం కలిగిస్తున్నాతి - అని అర్ధమైంది.
ఇతరదేశాలలోని ఆర్ధికవ్యవస్థల తులనాత్మక పరిశీలనకు దోహదపడ్తున్నవి.
IVNS గారు రాసిన వ్యాసలు మరిన్ని రావాలి.
అప్పుడే ఇలాగ పోల్చి చూసే దృక్కోణాలకు వీలు కుదురుతుంది.
Quote
 
 
+2 #1 నా తెలుగు రచనలు rao Lakkaraju 2012-07-04 16:22
మీరు వ్రాసిన విధానం చదవటానికి కొంచెం బాధగా ఉంది అందుకని నా సమాధానాలు ఇస్తున్నాను.

1. అమెరికాలో పిల్లలు కనీసం 21 ఏళ్ళ దాకా కాలేజీల్లో(డిగ్ రీ కావాలంటే) ఉంటారు. అప్పులు చేసి చదువుకుంటారు. చేతుల్లో డబ్బులు లేనప్పుడు హెల్త్ కు డబ్బులు పెట్టటం కుదరదు.తల్లి తండ్రులకు హెల్త్ ఇన్సురన్సు ఉండి పిల్లలకు ఉండక పోటం తోటి పిల్లల ఆరోగ్యం కోసం పెట్టింది ఈ రూల్.
ఇండియాలో పిల్లలకి హెల్త్ ఇన్సురన్సు ఉన్నదో లేదో నాకు తెలియదు.

2. లేకపోతే ఇన్సురన్సు కంపెనీలు డబ్బులు అయిపోయాయని ఇంటికి పంపించేస్తారు. అటువంటివి జరగకపోతే ఈ రూల్ వచ్చేది కాదు.

3.ఏ కంపెనీలయినా లాభాలకోసం నడిచేవి. ఇన్సురన్సు కంపెనీలు కూడా ఆ వర్గానికి చెందినావే. కేన్సర్, స్త్రోకు, హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్ళ ఇన్సురన్సు కాన్సిల్ చేసినవి ఎన్నో(డబ్బులు చాలా ఖర్చు పెట్టాలి కాబట్టి). వాళ్ళ ఉద్యోగం కూడా ఊడచ్చు ఎందుకంటే ఉద్యోగులందరి మీదా ఇన్సురన్సు భారం పెరుగుతుంది. వాళ్ళకోసం పెట్టినది ఈ రూల్.

ఈ విధంగా ప్రజలకు,పేదలకు మంచి చెయ్యాలని చూసిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటే చెప్పండి.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh